సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు టీమిండియాను ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానెలపై సెలక్టర్లు వేటు వేశారు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు టెస్టు జట్టులో చోటు కల్పించారు. అటు టీ20 సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించారు. టీ20 సిరీస్‌కు కోహ్లీ, పంత్‌కు విశ్రాంతి ఇచ్చారు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. కాగా శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. మార్చి 4 నుంచి తొలి టెస్ట్ […]
విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసలు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓ అభినందన పత్రాన్ని పంపించారు. ఈ లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మీడియాకు చూపించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బెల్లాన చంద్రశేఖర్ ప్రతిరోజు ఆసుపత్రులను సందర్శిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారని ఆ లేఖలో […]
అభిరామ్.ఎం దర్శకత్వంలో ప్రియాంక శర్మ కీలక పాత్రను పోషిస్తున్న చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. సెలెబ్రిటీకీ – అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామానే ఈ చిత్రకథాంశం. ఇందులో సెలబ్రిటీగా ప్రియాంక శర్మ నటిస్తుంటే, ఆమె అభిమాని పాత్రను శివ ఆలపాటి పోషిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న షకలక శంకర్, రాజీవ్ కనకాల ఫస్ లుక్ పోస్టర్స్ ను చిత్ర బృందం […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈనెల 21న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలిపింది. దీంతో శనివారం ట్రైలర్ విడుదల కావడం లేదని తేలిపోయింది. అటు ఈనెల 21న భీమ్లా నాయక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వస్తున్నట్లు చిత్ర […]
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే స్టేషన్‌లో రైల్వే ఎస్సై వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే… కాకినాడ రైల్వే స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్‌ఫారంపైకి కాకినాడ-తిరుపతి రేణిగుంట ఎక్స్‌ప్రెస్ వచ్చింది. రైలు వెళ్ళిపోతున్న సమయంలో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రన్నింగ్ ట్రైయిన్ కావడంతో పొరపాటున కాలు జారింది. ప్రయాణికులు రైలు, ప్లాట్‌ఫారం మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు అతడిని చాలా దూరం పాటు ఈడ్చుకెళ్లింది. అయితే ప్రయాణికుడిని వెంటనే గమనించిన రైల్వే ఎస్సై […]
కరోనాతో గత రెండేళ్లుగా జీతాల పెంపు లేని ప్రైవేటు ఉద్యోగులకు అయాన్స్ సంస్థ సర్వే తీపికబురు చెప్పింది. 2022 ఏడాదిలో జీతాల విషయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఐదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఇంక్రిమెంట్లు ఇస్తాయని సర్వే వెల్లడించింది. సగటున 9.9% వేతనాల పెంపు ఉంటుందని అయాన్ సంస్థ తెలిపింది. 2021లో వేతనాల పెంపు సగటు 9.3 శాతంగా ఉందని గుర్తు చేసింది దీంతో ఈ ఏడాది ఇంక్రిమెంట్లు పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. మరోవైపు బ్రిక్స్ కూటమిలోని […]
హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ […]
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై దొంగతనం కేసు నమోదైంది. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ గాడిదను దొంగతనం చేసినట్టు అందిన ఫిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. రంగనాయకుల గుట్ట దగ్గరున్న సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే గాడిదను దొంగతనం చేశాడన్న ఆరోపణలపై వెంకట్ బల్మూరిని గత రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారని […]
ఈనెల 20న ఆదివారం నాడు కడప, విశాఖ జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కడప చేరుకుంటారు. పుష్పగిరిలోని విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఆ […]
అసోంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు స్కూటర్ కొనుగోలు చేసేందుకు తాను తాచుకున్న డబ్బంతా బైక్ షోరూంకు బస్తాలో తీసుకెళ్లాడు. అయితే ఆ నగదు అంతా చిల్లర నాణేలు కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నెలలు తరబడి చిల్లర నాణేలను పొదుపు చేశాడు. ఇలా ఎనిమిది నెలల పాటు పోగుచేసిన నాణేలను ఒక బస్తాలో వేసి […]