పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈనెల 21న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలిపింది. దీంతో శనివారం ట్రైలర్ విడుదల కావడం లేదని తేలిపోయింది. అటు ఈనెల 21న భీమ్లా నాయక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
మలయాళంలో సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సినిమా ఇదే. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీలో కూడా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలవుతోంది.
A peek into the Ultimate face-off of DUTY and POWER ??#BheemlaNayakTrailerStorm from 21st Feb ?️#BheemlaNayakTrailerOnTheWay ? #BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/04RDWylmav
— Sithara Entertainments (@SitharaEnts) February 19, 2022