కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం కేసీఆర్‌కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించా అని చెప్పారు. ఇక కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్ మాట్లాడిని భాష సరికాదన్నారు. ఈరోజు మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు.
‘కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కరెక్ట్ కాదు. మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. సీఎం తన భాషపై పునరాలోచన చేయాలి. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది. కేసీఆర్ కుమారుడు అహంకారం తలకెకినట్టు మాట్లాడుతారు. గతంలో కేసీఆర్ మాట్లాడితే మేము ఖండించాం. సీఎం రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకే నష్టం’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
Also Read: Eesha Movie Review: ‘ఈషా’ మూవీ రివ్యూ!
‘తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ఏమీ చేశారో ఆధారాలతో సహా బయట పెట్టింది ముందు నేనే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నారు. ముడుపుల కోసం 575 టీఎంసీలు అడగలేదు. కేసీఆర్‌కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నేనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించాను. కాళేశ్వరం స్కాం నుంచి దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కృష్ణ జలాలు ఇష్యూ తెరపైకి తెస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పాలి. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.