Viral Video: కాకినాడలో రైలు కింద పడిన ప్రయాణికుడు.. కాపాడిన ఎస్సై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే స్టేషన్‌లో రైల్వే ఎస్సై వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే… కాకినాడ రైల్వే స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్‌ఫారంపైకి కాకినాడ-తిరుపతి రేణిగుంట ఎక్స్‌ప్రెస్ వచ్చింది. రైలు వెళ్ళిపోతున్న సమయంలో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రన్నింగ్ ట్రైయిన్ కావడంతో పొరపాటున కాలు జారింది. ప్రయాణికులు రైలు, ప్లాట్‌ఫారం మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు అతడిని చాలా దూరం పాటు ఈడ్చుకెళ్లింది.
అయితే ప్రయాణికుడిని వెంటనే గమనించిన రైల్వే ఎస్సై రామారావు పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని గట్టిగా లాగారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, చాకచక్యంగా బయటకు లాగి కాపాడారు. ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు రైలులోని ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు కూడా ఆగింది. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే ఎస్సై, సిబ్బందిని అందరూ అభినందించారు. కాగా ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!