CM Chandrababu: అమరావతిలో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఒక చరిత్ర, ఒక యుగపురుషుడు జన్మించిన రోజు.. ప్రజా రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.. శత జయంతి ఉత్సవాలను ఈ ప్రాంతంలో ఇంత ఘనంగా జరుపుకున్నాం అంటే అది రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇచ్చిన అన్నదాతల చొరవే.. శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కూటమి నేతల సహకారం మర్చిపోలేనిది.. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నేత అటల్ జీ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Shivraj Singh chouhan: ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు
అయితే, యాంటీ కాంగ్రెస్ కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు.. రామారావుకి వాజ్ పేయికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలో మొదటిసారిగా ఆర్టికల్ సవరణ ప్రారంభించిన వ్యక్తి పీవీ నరసింహా రావు ఆయన ఓ తెలుగు వ్యక్తి.. వాజ్ పేయితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులలో నేను ముఖ్యమైన వాడిని.. మలేషియా దేశాన్ని చూసి అటల్ జీకి చెప్పిన వెంటనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో చెన్నై తడ హైవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.. అనేక సంస్కరణలు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత అటల్ జీకి మాత్రమే దక్కుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇక, హైదరాబాద్ లో ఓపెన్ స్కై పాలసీ ద్వారా ఫ్లైట్ లు మంజూరు చేసిన ఘనత అటల్ జీ ది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1 లక్ష 46 వేల కిలో మీటర్ల హైవేలను భారత్ దేశంలో నిర్మించింది వాజ్ పేయి హయంలోనే అని గుర్తు చేశారు. అప్పటి కార్గిల్, నేటి సింధూర్ లలో ప్రత్యర్థి దేశానికి చెమటలు పట్టించిన ఘనత అప్పుడు అటల్ జీ ది, నేడు నరేంద్ర మోడీ ది అని ప్రశంసించారు. రాష్ట్రంలో- దేశంలో ఉన్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి.. భారత దేశం ఉన్నంత వరకు దేశ ప్రజల గుండెల్లో ఉండబోయే వ్యక్తి, ఉన్న వ్యక్తి కచ్చితంగా అటల్ జీ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.