Bellana Chandrasekhar: వైసీపీ ఎంపీపై లోక్‌సభ స్పీకర్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసలు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓ అభినందన పత్రాన్ని పంపించారు. ఈ లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మీడియాకు చూపించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బెల్లాన చంద్రశేఖర్ ప్రతిరోజు ఆసుపత్రులను సందర్శిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారని ఆ లేఖలో స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఎంపీ నిధుల్లో రూ.30 లక్షలు ఖర్చు చేసి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, తద్వారా ఆక్సిజన్ కొరత తీరిందని ప్రశంసించారు. కాగా ఈ లేఖపై ఎంపీ బెల్లాన స్పందిస్తూ… తాను ఓ ఎంపీగా తన బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ప్రజలకు అండగా నిలవడం తన కర్తవ్యమని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండాలన్న సీఎం జగన్ ఆదేశాలను పాటించానని వివరించారు. తన సేవలను అభినందిస్తూ స్పీకర్ ఓం బిర్లా లేఖ పంపడం సంతోషదాయకమన్నారు.
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
తాజావార్తలు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?