కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ (19) విఫలమైనా… మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ (52), కీపర్ రిషబ్ పంత్ (52) రాణించారు. పంత్, వెంకటేష్ అయ్యర్ కలిసి 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోస్టన్ ఛేజ్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌కు అభినందనలు చెప్పాలని.. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం అద్భుతం అంటూ సోమిరెడ్డి ప్రశంసలు కురిపించారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం చేస్తూ కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం తనకు నచ్చిందని సోమిరెడ్డి తెలిపారు. అటు దేశంలో […]
అమరావతి: టీడీపీ కార్యాలయంలో రెండో రోజు సర్పంచుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సర్పంచ్‌లకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలని వారికి హితవు పలికారు. టీడీపీ సర్పంచ్‌లు ఉన్న ప్రతి చోట చెత్త పన్నుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.. ఆ దిశగా […]
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15 ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అసిస్టెంట్ కోచ్ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా చేశారు. ఇటీవల ఐపీఎల్ ఆటగాళ్ల కోసం జరిగిన మెగా వేలం పాటలో ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. యాజమాన్యంతో విభేదాలు వచ్చినందుకే సైమన్ కటిచ్ జట్టును వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ‘ది ఆస్ట్రేలియన్’ […]
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతుందని.. మూడేళ్ల కాలంలో మూడు పైసలు కూడా తేలేదన్నారు. బీజేపీ అంటే బక్వాస్ పార్టీ అని.. ఆ పార్టీ నేతలకు లొల్లి ఎక్కువ.. పని తక్కువ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఇప్పటివరకు […]
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా నడుస్తోంది. తాజాగా విజయపుర జిల్లాలోని ఇండి ప్రభుత్వ పీయూసీ కాలేజీకి తిలకం (సింధూరం) పెట్టుకుని వచ్చిన హిందూ విద్యార్థిని లెక్చరర్లు అడ్డుకున్నారు. తిలకం తీసేసి లోపలికి రావాలని ఆదేశించారు. దీనికి విద్యార్థి తిరస్కరించాడు. అయితే తిలకం ఉంటే కాలేజీ లోపలకు వచ్చేందుకు వీల్లేదని, ఇంటికి వెళ్లిపోవాలని లెక్చరర్లు స్పష్టం చేశారు. దీంతో భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. సింధూరం అనేది మతానికి సంబంధించినది కాదని, […]
లగడపాటి శిరీషా, శ్రీధర్ దంపతులది చిత్రసీమలో సుదీర్ఘ ప్రయాణం. 2005లో ‘ఎవడిగోల వాడిది’తో మొదలైన ఆ ప్రయాణం మొన్న ‘నా పేరు సూర్య’ వరకూ అప్రతిహతంగా సాగింది. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి, మెప్పించిన వారి తనయుడు విక్రమ్ సహిదేవ్ ఇప్పుడు హీరోగా ఎదిగాడు. అతన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వారు తీసిన యూత్ ఫుల్ మూవీ ‘వర్జిన్ స్టోరీ’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఇది వన్ నైట్ లో జరిగే కథ. అంతేకాదు… వన్ […]
ఈనెల 24 నుంచి బయోఏషియా-2022 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆ సమావేశంలో లైఫ్ సైన్సెస్ గురించి బిల్‌గేట్స్‌తో జరిగే చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా ఎదుర్కొన్న అనుభవాలు, హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్‌గేట్స్, కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. Read […]
మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద పార్టీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడతారో, ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియాలని రసమయి అన్నారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడతారని.. అది ఇక్కడున్న వాళ్లకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి వెళ్తామో లేదో తెలియని ప్రాంతంగా ఉండేదని.. ఎన్నో ఏళ్లు […]
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరు మీద […]