సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు టీమిండియాను ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానెలపై సెలక్టర్లు వేటు వేశారు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు టెస్టు జట్టులో చోటు కల్పించారు. అటు టీ20 సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించారు. టీ20 సిరీస్‌కు కోహ్లీ, పంత్‌కు విశ్రాంతి ఇచ్చారు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. కాగా శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. మార్చి 4 నుంచి తొలి టెస్ట్ మొహాలీలో, మార్చి 12 నుంచి రెండో టెస్ట్ బెంగళూరులో జరగనున్నాయి. మార్చి 24, 26, 27 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లను లక్నో, ధర్మశాలలో నిర్వహించనున్నారు.
టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమా విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా (వైస్ కెప్టెన్)
టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, దీపక్ హుడా, చాహల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్