ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై దొంగతనం కేసు నమోదైంది. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ గాడిదను దొంగతనం చేసినట్టు అందిన ఫిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. రంగనాయకుల గుట్ట దగ్గరున్న సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని వస్తుండగా జమ్మికుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.
అయితే గాడిదను దొంగతనం చేశాడన్న ఆరోపణలపై వెంకట్ బల్మూరిని గత రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పోలీసుల నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలమని వ్యంగ్యం ప్రదర్శించారు. దీని గురించి మీరేం అనుకుంటున్నారు? అంటూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో నెటిజన్‌లను ప్రశ్నించారు.
https://twitter.com/revanth_anumula/status/1494691158823665667