హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖలు సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మికుల సంక్షేమంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి నిర్మాతలు నట్టి కుమార్, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్, దర్శకుడు రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజతో పాటు 24క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రముఖుల పాల్గొన్నారు. ఈ భేటీలో కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటంకాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల మెగాస్టార్ […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. సన్ […]
వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్‌పై సజ్జల కాన్వాయ్ వాహనాలు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. ఓ వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు […]
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మీ పూరింటిని కూల్చివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీ మూకలతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న అనంతలక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ […]
మంచు మోహన్‌బాబు కుటుంబసభ్యులపై కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల అంశం, సన్నాఫ్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు.. ఇలా ప్రతి అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్‌ను తక్షణమే తొలగించకపోతే చర్యలు […]
గుంటూరు జిల్లా పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులు చేపట్టాలంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నేత కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు రాజుపాలెం నుంచి దేవరంపాడు గుడి వరకు పాదయాత్రను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లిన కోడెల శివరాం టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం […]
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ నగర శివారులోని శంకర్ పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని హైకోర్టులో చిన్ని కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినందుకు.. తనపై కొందరు దాడికి యత్నించారని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్‌లో చిన్ని కృష్ణ శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ […]
దక్షిణాదిలో కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది జాతర ఉంటుందో లేదో అన్న అనుమానంతో మూడు నెలల ముందు నుంచే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు రాకపోకలు సాగించారు. ఈనెల 16న జాతర ప్రారంభమయ్యే నాటికి 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ ఈ నెల 25న జనం ముందుకు వస్తుండటంతో ఆ రోజున విడుదల కావాల్సిన మరో మూడు సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ప్రచారపర్వాన్ని పీక్స్ కు తీసుకెళ్ళిన శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. అలానే వరుణ్ తేజ్ ‘గని’ మూవీని అదే తేదీకి పంపే ప్రయత్నం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా […]