విజయవాడ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీ సీఎం జగన్‌ను మెచ్చుకోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సాధారణంగా మితభాషి అని.. ఆయనకు పొగడ్తలు అంటే గిట్టవు అని.. అందుకే ఆయన ఎవరినీ ప్రశంసించిన దాఖలాలు ఉండవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాంటి నితిన్ గడ్కరీ జగన్‌ను మెచ్చుకోవడం మాములు విషయం కాదన్నారు. ఏదైనా సాధించగల గట్టి ఆశయాలు ఉన్న డైనమిక్ లీడర్ జగన్ అని నితిన్ గడ్కరీ మెచ్చుకోవడం […]
ఏపీలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలతో టీడీపీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే చంద్రబాబుతో సమావేశానికి గంటా హాజరుకాలేదు. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని టీడీపీ కార్యాలయానికి గంటా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో రాలేకపోతున్నానని గంటా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. Read Also: […]
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయం, గోశాలకు సీఎం జగన్ శుక్రవారం నాడు భూమిపూజ చేశారు. రూ.70 కోట్లతో శ్రీకృష్ణ ఆలయం, యువత కోసం యోగా ధ్యాన కేంద్రాలను ఇస్కాన్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన భూమిని కేటాయించింది. అనంతరం రూ.20 కోట్లతో ఇస్కాన్ అక్షయపాత్ర ఏర్పాటు చేసిన ఆధునిక కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనాన్ని అందించనుంది. […]
తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. శుక్రవారం నాడు మేడారం జాతరకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని అమ్మవార్లను కోరుకున్నట్లు వెల్లడించారు. గతంలో తాను కోరుకున్న కోర్కెలను అమ్మవారు తీర్చారని.. ఇప్పుడు కూడా తన కోరికను అమ్మవార్లు తీరుస్తారని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా సమ్మక్క […]
కొంతమందికి నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినిమా టైటిల్స్ భలేగా అచ్చి వస్తాయి. మహేశ్ బాబుకు అక్కినేని పాత సినిమా టైటిల్స్ ‘యువరాజు, శ్రీమంతుడు’ కలసి వచ్చాయి. అదే తీరున నాటి స్టార్ కమెడియన్ సునీల్ కూడా ‘అందాల రాముడు’, ‘పూలరంగడు’ వంటి ఏయన్నార్ సినిమా టైటిల్స్ తో గ్రాండ్ సక్సెస్ పట్టేశారు. ‘అందాలరాముడు’తో హీరోగా సక్సెస్ చూశారు సునీల్. తరువాత కొన్ని సినిమాల్లో హీరో స్థాయి పాత్రలు ధరించారు. ఆ పై రాజమౌళి ‘మర్యాద రామన్న’తో బంపర్ […]
ఏపీలో టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. మొత్తం 12 మందిని శుక్రవారం జరిగే సమావేశానికి రావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఈ జాబితాలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా క్రియాశీలకంగా లేరు. అయితే ఓ సారి బీజేపీలో చేరుతారని.. మరోసారి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అటు ఖండించలేక.. ఇటు అంగీకరించలేక గంటా సైలెంట్‌గానే ఉన్నారు. మధ్యలో […]
తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. మేడారం జాతరకు భారీ ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్రం మొత్తానికి కాకుండా కేవలం వరంగల్, పెద్దపల్లి జిల్లాలకే వర్తించనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సెలవులపై ప్రకటన చేశారు. మేడారం జాతర సందర్భంగా వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో శుక్రవారం […]
తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అన్ని చోట్ల కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ ప్రత్యేక అభిమానం చాటుతూ దేశంలోనే తొలిసారిగా బోటుపై బ్యానర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కన ప్రత్యేకమైన బోటులో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ […]
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. పర్యటన అనంతరం నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా […]
ఐపీఎల్ 2022కు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. మరో 50 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ భావిస్తోంది. అయితే టోర్నీ ప్రారంభం కాకముందే ఆ జట్టుకు పెద్ద దెబ్బ తగిలిందని తెలుస్తోంది. కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడని సమాచారం. ఎందుకంటే అతడు త్వరలోనే […]