ఉక్రెయిన్‌పై రష్యా భీకర రీతిలో యుద్ధం చేస్తోంది. ఈ కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొంతమంది భారతీయులు ఇంకా అక్కడే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు సురక్షితంగా తిరిగొస్తాడో, లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణం విడిచింది. తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ ఉక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి […]
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో తిరునాళ్ల ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రభల వేడుక కన్నులపండువగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రభలు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు చేశారు. నరసరావుపేట నుంచి నుంచి వచ్చే భక్తులు ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మార్గంలో కొండకు చేరుకుని నాగిరెడ్డి గెస్ట్‌హౌస్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని తెలిపారు. నరసరావుపేట నుంచి […]
ప్రసిద్ధ శైవక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పాతాళ గంగలో నీటిమట్టం భారీగా తగ్గిపోయింది. మెట్ల కిందకు నీటిమట్టం పడిపోవడంతో భక్తులకు నీటికొరత ఏర్పడింది. దీంతో భక్తులు స్నానాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రద్దీ దృష్ట్యా వసతి సౌకర్యం లేకపోవడంతో భక్తులు రోడ్ల మీదే సేద తీరుతున్నారు. […]
భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేస్తున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. టిక్కెట్ రేట్లు కావాలనే పెంచకపోవడం, అదనపు షోలకు అనుమతులు ఇవ్వకపోవడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇలా పలువురు నేతలు పవన్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. జగన్ హీరోగా సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన […]
ఏపీలో మరోసారి ఎన్నికల సందడి కనిపించబోతోంది. ఈ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో తాజాగా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసింది. మార్చి 24న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్ కూడా నిర్వహిస్తామని తెలిపింది ఈ ఉప ఎన్నికకు […]
ఓ క్రికెట్ మ్యాచ్ ఏకంగా గిన్నిస్ రికార్డుల్లో ఎక్కింది. ఆ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడో జరిగిందో మీకు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. 1939లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ 10రోజుల పాటు జరిగింది. ఇది క్రికెట్ చరిత్రలోనే అతి సుదీర్ఘమైన మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్ గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఈ మ్యాచ్ మార్చి 3 నుంచి 14 వరకు జరిగింది. ఇంగ్లండ్ జట్టు ఐదు […]
ఏపీ వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 7న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో […]
అమరావతి: టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యను గతంలో తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని.. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనమయ్యారని విమర్శించారు. వివేకా […]
ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన పక్రియపై ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ స్పందించారు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించామని.. వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నాయో.. ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష […]
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో రోహిత్ 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే అవుటైన ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ 45 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును రోహిత్ క్రాస్ చేశాడు. అలాగే […]