Andhra Pradesh: మార్చి 7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ హాజరవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 7న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు.
మార్చి 11 లేదా 14 తేదీల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు రూ.2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముంది. ఇప్పటికే బడ్జెట్ పై అన్ని శాఖల కసరత్తు దాదాపు పూర్తైంది. ఈసారి బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్ జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వ్యవసాయం పాడి పరిశ్రమపై దృష్టిపెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ హాజరవుతుందా లేదా అనే అంశంపై స్పష్టత కరువైంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణంగా చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. అప్పట్లో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు.
Also Read
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
తాజావార్తలు
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!