మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ప్రకటించింది. శివరాత్రి సందర్భంగా ఏపీలోని 96 శైవక్షేత్రాలకు 3,225 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆయా బస్సుల్లో గతంలో మాదిరిగానే అదనపు ఛార్జీలు ఉంటాయని తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు 410 బస్సులు, శ్రీశైలానికి 390 బస్సులు నడపనున్నట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన, పశ్చిమ గోదావరి జిల్లాలోని బలివె, పట్టిసీమ తదితర […]
దేశంలో శుక్రవారంతో పోలిస్తే శనివారం కరోనా కేసులు మరిన్ని తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,499 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 255 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,05,844కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,13, 481గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 23,598 మంది కరోనా […]
నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బీ ఫార్మసీ విద్యార్థుల నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్(28)కు వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులో ఉంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలీసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆరునెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని […]
ఐపీఎల్ 15వ సీజన్ కోసం కొత్త ఫార్మాట్‌ను నిర్వాహకులు అమలు చేయబోతున్నారు. ఈ ఏడాది జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించేందుకు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కానీ ఎప్పటిలాగే గ్రూప్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. కొత్త ఫార్మాట్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్-ఎలో ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి. ఎక్కువ ట్రోఫీలు […]
విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ […]
ప్రొ.కబడ్డీ-8వ సీజన్ ఫైనల్ హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ను 37-36 తేడాతో దబాంగ్ ఢిల్లీ చిత్తు చేసి తొలి టైటిల్‌ను చేజిక్కించుకుంది. టైటిల్ పోరులో దబాంగ్ ఢిల్లీకి పట్నా పైరేట్స్ గట్టి పోటీనే ఇచ్చింది. తొలి హాఫ్‌లో ఢిల్లీ 15 పాయింట్లు సాధిస్తే పట్నా ఏకంగా 17 పాయింట్లు సాధించింది. అయితే రెండో హాఫ్‌లో ఢిల్లీ శక్తిని కూడదీసుకుని టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీంతో మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన పట్నా పైరేట్స్ ఒక […]
★ శ్రీశైలంలో ఐదోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు… సాయంత్రం ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ.. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవ★ ఈరోజు మధ్యాహ్నం ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి రానున్న 22 మంది తెలుగు విద్యార్థులు.. బుకారెస్ట్ నుంచి ఢిల్లీ రానున్న 13 మంది.. బుకారెస్ట్ నుంచి ముంబై రానున్న 9 మంది తెలుగు విద్యార్థులు★ ఢిల్లీ: నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం, ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై […]
ఏపీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. తమ హీరో సినిమా చూద్దామని వెళ్తుంటే థియేటర్లు మూసి ఉండటం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. టిక్కెట్ రేట్లపై కొత్త జీవో రాకపోవడంతో జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ముఖ్యంగా సి, డి సెంటర్లలో థియేటర్ల యజమానులు లబోదిబోమంటున్నారు. రూ.20, రూ.15, రూ.5 రేట్లకు తాము టిక్కెట్లను విక్రయించి నష్టపోలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో […]
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీనామా, కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్‌లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలతో ఆయన అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని ఆయన అడిగారు. […]
ఉక్రెయిన్‌పై రష్యా భీకరస్థాయిలో యుద్ధం చేస్తోంది. దీంతో ప్రజలు భయంతో అల్లాడుతున్నారు. అయితే రష్యా మొదటి లక్ష్యం తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము ఉక్రెయిన్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంతవరకు పోరాడుతూనే ఉంటామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘మనతో కలిసి యుద్ధం […]