ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు. భారత విద్యార్థి నవీన్ ఆహారం […]
దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో గత నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరిలో మొత్తం 1,33,026 కోట్ల వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 18 శాతం అధికంగా రూ.1.33 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఒక నెలలో రూ.1.30 లక్ష కోట్ల మార్కు దాటడం జీఎస్‌టీ చరిత్రలో ఇది ఐదోసారి. మొత్తం నమోదైన వసూళ్లలో సీజీఎస్‌టీ ద్వారా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ద్వారా రూ.30,779 […]
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు బైపాస్ రోడ్డులోని ఉడ్ కాంప్లెక్స్ శివారులో పార్కింగ్ చేసి ఉన్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో తొలుత మంటలు చెలరేగగా.. ఆ మంటలు నెమ్మదిగా పక్కన ఉన్న బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 8 ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా […]
మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే శివరాత్రి పర్వదినం రోజు శివయ్య భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. అయితే చాలా మందికి శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలనే సందేహాలు తలెత్తుతుంటాయి. పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు. అందుకే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉంటే ఆయన కటాక్షం పొందవచ్చని వేద పురాణాలు చెప్తున్నాయి. ఉపవాసం అంటే ఉప + ఆవాసం అన్నమాట. అందుకే శివరాత్రి రోజు […]
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండేళ్లుగా అతడి కెరీర్‌లో సెంచరీ అనేది లేదు. అయినా అతడు కెప్టెన్ కాబట్టి ఇన్నాళ్లూ జట్టులో కొనసాగుతూ వచ్చాడు. ఇప్పుడు కెప్టెన్సీ కూడా పోయింది. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లీ బ్యాటింగ్‌లో మార్పు వస్తుందని చాలా మంది ఆశించారు. కానీ అతడి బ్యాటింగ్‌లో మునుపటి వాడి, వేడి లేవనే విషయం మాత్రం అర్థమవుతోంది. అడపాదడపా కష్టపడి హాఫ్ సెంచరీలు కొడుతున్నా అవి సాధికారిక […]
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌గా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కాగా వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జిగా తనను నియమించినందుకు సీఎం జగన్‌కు ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా […]
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య సమావేశం ముగిసింది. బెలారస్ వేదికగా సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని, రష్యా సైన్యం తమ దేశం నుంచి వెనక్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. అటు నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా కోరింది. ఈ డిమాండ్లకు ఇరుదేశాలు అంగీకరించకపోవడంతో చర్చలు విఫలంగా ముగిశాయి. ఒక్క […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్‌పర్సన్‌ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్‌కు అప్పగించింది. క్యాపిటల్ మార్కెటింగ్ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా మూడేళ్ల పాటు మాధవి పూరీ బుచ్ నియామకానికి […]
ఓటీఎస్ పథకంపై ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం […]
అమూల్ సంస్థ పాల ధరలను మరోసారి పెంచింది. తన అన్ని రకాల పాల ధరలను పెంచుతున్నామని సోమవారం ప్రకటించింది. లీటర్ పాలపై రూ.4 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. మరోవైపు అమూల్ తాజా […]