ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బీరు తయారీలోకి వినియోగించే ప్రధాన ముడి పదార్థం బార్లీ ఉత్పత్తిలో రష్యా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. బీర్ తయారీకి మరొక ముడి పదార్థం మాల్ట్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆగకుండా ఇలాగే మరికొంత కాలం జరిగితే బార్లీ కొరత ఏర్పడనుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బార్లీ […]
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా నడుస్తోందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 3 దాకా అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త జిల్లాలలో ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు […]
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం కనపరుస్తున్న తీరు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రంలో పేదవాడికి ఉన్న ఏకైక వినోదం సినిమా.. ఆ సినిమా పరిశ్రమను కూడా వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా ముఖ్యమంత్రి గారూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. సినిమాకు కూడా కులగజ్జి అంటించి తమాషా చూస్తున్నారని […]
ధర్మశాల వేదికగా శనివారం రాత్రికి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వర్షం ఆగిపోయినా మబ్బులు ఉంటాయన్నారు. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌పైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కాగా టీ20లలో టీమిండియా […]
హైదరాబాద్ నగరంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టేందుకు ఆటోలతో ప్రమాదకర విన్యాసాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఆటోలతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఈ మేరకు ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని […]
దేశంలో ఎక్కడైనా సరే.. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి ఆఫీసుకి రారు అనే అపవాదు నెలకొని ఉంది. అయితే ఉద్యోగులు సమయానికి రావాలి.. విధులు సక్రమంగా నిర్వహించాలని ఏ ప్రభుత్వం అయినా కోరుకుంటుంది. ఉద్యోగులతో సరిగ్గా పనిచేయించుకోవడం ముమ్మాటికీ ప్రభుత్వ బాధ్యతే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఉద్యోగులు సమయానికి ఆఫీసుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని సచివాలయ […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. వరుసగా మూడోరోజు కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల దాడి సాగుతోంది. రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు కీవ్ నగరంలో స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేషన్లే ఇప్పుడు బాంబు షెల్టర్లు. అక్కడ తలదాచుకుంటున్న ఓ గర్భిణి ప్రసవించింది. బేబీకి జన్మనిచ్చిన విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా మెట్రో స్టేషన్‌లనే బంకర్లుగా […]
దేశంలో ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 5జీ టెలికాం సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 2022, ఆగస్టు 15 కల్లా 5జీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. దీంతో 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన సిఫార్సులను మార్చికల్లా అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. వివిధ బ్యాండ్‌లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణం, ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ చేయనుంది. అటు అల్ట్రా హైస్పీడ్ […]
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ-2022లో తమిళనాడుకు చెందిన అన్నదమ్ములు అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే మ్యాచ్‌లో ఒకే జట్టు తరఫున సెంచరీలు కొట్టిన కవలలుగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒకే జట్టు తరఫున శతకాలు బాదేసిన కవలలుగా కూడా నిలిచారు. గౌహతి వేదికగా జరుగుతున్న ఎలైట్ గ్రూప్ హెచ్ మ్యాచులో ఛత్తీస్‌గఢ్‌పై బాబా అపరాజిత్ (166), బాబా ఇంద్రజిత్ (127) సెంచరీలు బాదారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అపరాజిత్‌కు ఇది 10వ సెంచరీ కాగా […]
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 27న ఆదివారం పల్స్ పోలియోను అధికారులు నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అనంతరం రెండు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నాడు హెల్త్, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ […]