ఈనెల 3న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పెద్దకర్మ దృష్ట్యా ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని మార్చి 7వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆ రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్ర […]
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో వాహనదారులు పెండింగ్ ఛలాన్‌లు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.100 జరిమానా పడితే..రూ.25 చెల్లిస్తే సరిపోతుందంటూ ఆఫర్ ఇవ్వడంతో తొలిరోజే పెద్ద ఎత్తున వాహనదారులు ఛలాన్‌లు కట్టేందుకు పోటెత్తారు. ఈ కారణంగా పెండింగ్‌లో ఉన్న ఛలాన్లు నిమిషానికి 700 చొప్పున క్లియర్ అవుతున్నాయని తెలుస్తోంది. అయితే వాహనదారులందరూ ఒక్కసారిగా వెబ్‌సైట్ మీదకు రావడంతో ఈ-ఛలాన్ సర్వర్ క్రాష్ అయ్యిందని అధికారులు చెప్తున్నారు. సర్వర్ క్రాష్ కావడంతో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు […]
మరో 25 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే మెగా లీగ్ ఆరంభానికి ముందే కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. భారీ అంచనాలతో కొనుగోలు చేసిన స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. చాలా కాలంగా కరోనా కారణంగా బయోబబుల్‌లో గడుపుతున్నానని, దీంతో ఒత్తిడి పెరిగిందని.. అందుకే ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు రాయ్ తెలిపాడు. అయితే రాయ్ తప్పుకోవడంతో గుజరాత్ జట్టుకు ఓపెనర్ సమస్య మొదలుకానుంది. […]
వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని.. ఈ కుట్ర ఇప్పుడు పరాకాష్టకు చేరిందని సజ్జల వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబాన్ని ఇరికించేలా పూర్తిగా రాజకీయపరమైన కుట్రను ఒక ముఠా […]
హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే ఛాన్స్ దొరికితే విలన్ గా తన సత్తా చాటుతున్నాడు ఆది పినిశెట్టి. అంతేకాదు… ఇతర హీరోల చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడానికీ వెనకాడటం లేదు. అలా ‘రంగస్థలం’, ‘నిన్ను కోరి’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలలో నటించాడు. అయితే ‘సరైనోడు’లో ముఖ్యమంత్రి తనయుడు వైరం ధనుష్ గా ఆది పినిశెట్టి పోషించిన పాత్రను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు తాను ఉస్తాద్ రామ్ తో తీస్తున్న […]
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు తమ చిత్రాల పోస్టర్స్ ద్వారా పలువురు దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆ వరుసలోనే నిలిచింది ‘ది మాన్షన్ హౌస్’ చిత్ర బృందం. తలారి వీరాంజనేయ సమర్పణలో బీసీవీ సత్య రాఘవేంద్ర ‘ది మాన్షన్ హౌస్’ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ మెహర్, యశ్, వృందా కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేమంత్ కార్తిక్ దర్శకత్వం వహించే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. అతి త్వరలో సెట్స్ […]
బిగ్ బాస్ 5 ఫేమ్ మానస్ కొత్త వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే పలు చిత్రాలలో, సీరియళ్లలో నటించి చక్కని గుర్తింపు పొందిన మానస్ తొలిసారి ఓటీటీ కోసం ఈ వెబ్ సీరిస్ లో నటిస్తున్నాడు. అతని సరసన ‘రాజన్న’ ఫేమ్ యానీ నాయికగా నటించబోతోంది. విశేషం ఏమంటే మానస్ లానే యానీ సైతం బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఆమె ‘లూజర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్రను […]
రెబల్ స్టార్ ప్రభాస్ మైథలాజికల్ వండర్ ‘ఆదిపురుష్’ 3డీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ఈ ఉదయం తెలిపింది. అనేకానేక తేదీలు మార్చుకుని ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు ఫిక్స్ కావడం వెనుక దర్శకుడు ఓంరౌత్ కు సంబంధించిన సెంటిమెంట్ ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓంరౌత్ ఇంతవరకూ కేవలం రెండే సినిమాలను డైరెక్ట్ చేశాడు. ‘ఆదిపురుష్’ అతనికి దర్శకుడిగా మూడో చిత్రం. […]