తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. […]
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో వీర విహారం చేసిన అతడు ఏకంగా 27 ర్యాంకులు మెరుగై 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ టాప్-10 నుంచి పడిపోయాడు. దీంతో కోహ్లీ 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ర్యాంకులు తగ్గి 13వ ర్యాంకులో ఉన్నాడు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ ఒక ర్యాంకు తగ్గి […]
ఏపీలో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్‌కు సంబంధించి అధ్యయనం చేయాలంటూ ఇటీవల సీఎం కేసీఆర్ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీంతో ఈ కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ నేపథ్యంలో 1వ తరగతి నుంచి 8వ […]
భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించి గురువారం ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కల్యాణం టిక్కెట్లను పలు సెక్టార్‌లలో ఆలయ అధికారులు విక్రయించనున్నారు. కల్యాణోత్సవానికి రూ.7,500, రూ.2,500, రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.150 విలువ గల టిక్కెట్లతో పాటు పట్టాభిషేకం కోసం రూ.వెయ్యి విలువ గల టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కాగా కరోనాతో గత రెండేళ్లుగా భక్తులు లేకుండానే సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో భక్తుల మధ్య అంగరంగ వైభవంగా ఏప్రిల్ […]
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో మార్చి 4 నుంచి ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెదర్ […]
హైదరాబాద్ కృష్ణానగర్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తరగతి గదిలో సరదాగా ఆడుకున్న ఆట ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్‌లోని సాయికృప హైస్కూలులో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్‌తో క్రికెట్ ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆటలో భాగంగా విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. నలుగురు విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్‌పై దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. […]
టీమిండియా విషయానికి వస్తే ఇటీవల జట్టులో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతడు శ్రేయాస్ అయ్యర్ మాత్రమే. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్‌గా కూడా నిలిచాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో ఆటడం ఎంత కష్టంగా ఉంటుందో అయ్యర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. పొట్టి ఫార్మాట్‌లో డాట్ బాల్స్ ఆడటం తన దృష్టిలో పెద్ద నేరమని చెప్పాడు. ఎందుకంటే […]
భారత రాజకీయాల్లో ఒక మాట చాలా ప్రసిద్ధి. అదేంటంటే ఢిల్లీ రహదారి లక్నో నుంచే వెళుతుంది అని. దాని ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని. ఇంకో మాటలో చెప్పాలంటే యూపీని గెలవకుండా ఢిల్లీని గెలవలేరని అర్థం. ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ. బీజేపీ జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని […]
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్రం ఊరట కలిగించే వార్తను అందించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర బడ్జెట్ 2022-23లో రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్ర […]
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో పలు సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, అభిమానుల మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై […]