దేశంలో అత్యధిక మంది కోటీశ్వరులు ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో కోటీశ్వరుల విషయంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సర్వే చేసింది. ఈ జాబితాలో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఫార్మా, బయోటెక్ రంగాలతో పాటు ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కోటీశ్వరులు సంపదను వెనకేసుకోవడంలో దూసుకుపోతున్నారు. దాదాపు రూ.220 కోట్ల సంపద ఉన్నవాళ్లు హైదరాబాద్ నగరంలో 467 మంది ఉన్నారని నైట్ ఫ్రాంక్ సర్వే […]
నాబార్డ్ వార్షిక ప్రణాళికపై బుధవారం ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ సహకరిస్తోందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాబార్డ్, బ్యాంకులు సహాయం చేశాయని సీఎం జగన్ గుర్తు చేశారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ […]
విశ్వనటుడు కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఫస్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిన్నపాటి వీడియోను విడుదల చేస్తూ మూవీకి గుమ్మడికాయ కొట్టినట్టు చెప్పారు. విశేషం ఏమంటే… ఈ బుల్లి వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతున్న విజువల్ ఉంది. అనంతరం ఫహద్ ఫాజిల్ దర్శకుడు […]
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా గ్లిమ్స్‌ను అతని బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఒరిజినల్స్ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ పోస్టర్‌ను గౌతమ్ క్యారెక్టర్‌లోని పెయిన్‌ను తెలియచేసే విధంగా చిత్ర యూనిట్ డిజైన్ చేసింది. నటుడిగా ‘మను’తో సర్ ప్రైజ్ చేసిన గౌతమ్ ఈసారి […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. గతంలో భారత్ తరఫున సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే […]
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే తాను చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్ మీద బేస్ చేసి తీసిన […]
ఏపీలో కొత్త జిల్లాల అంశం వైసీపీ నేతల మధ్య చిచ్చుపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. తాజాగా జరిగిన ఘటన ఈ టాక్ నిజమే అనిపించేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి […]
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘విరాటపర్వం’. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహించారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, నందితాదాస్, బెనర్జీ, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం -2’, ‘నారప్ప’ చిత్రాలు ఓటీటీలో విడుదలైన నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మితమైన ‘విరాటపర్వం’ సైతం ఓటీటీలోనే వస్తుందనే […]
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఐఆర్‌సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ చమురు ధరలపై పడింది. ఈ ప్రభావం ఇండియా మీద కూడా పడబోతోంది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అనంతరం ఈనెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు […]