ICC T20 Rankings: అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్.. పడిపోయిన కోహ్లీ ర్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో వీర విహారం చేసిన అతడు ఏకంగా 27 ర్యాంకులు మెరుగై 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ టాప్-10 నుంచి పడిపోయాడు. దీంతో కోహ్లీ 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ర్యాంకులు తగ్గి 13వ ర్యాంకులో ఉన్నాడు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ ఒక ర్యాంకు తగ్గి పదో స్థానానికి పరిమితం అయ్యాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-1లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు.
అటు బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ మూడు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. టాప్-10 ఇండియా బౌలర్లకు చోటు దక్కలేదు. టాప్-1లో న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ కొనసాగుతున్నాడు. టాప్-10లో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఐదో స్థానంలో, రషీద్ ఖాన్ 9వ స్థానంలో నిలిచారు. కాగా శ్రీలంకతో సిరీస్‌లో 174 స్ట్రైక్‌రేట్‌తో శ్రేయాస్ అయ్యర్ 204 పరుగులు చేసి విరాట్ కోహ్లీ లేని లోటు తీర్చేశాడు.
Also Read
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
🔹 Rashid Khan breaks into top 10 ODI bowlers
🔹 Pathum Nissanka moves to No.9 in T20I batters’ listFull rankings ➡️ https://t.co/saWOSRZ2py pic.twitter.com/UUXbK8RDme
— ICC (@ICC) March 2, 2022
తాజావార్తలు
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!