శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ […]
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019 […]
పిల్లి, ఎలుక కొట్టుకుంటుంటే మన పెద్దలు పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అని చెప్తుంటారు. ఇప్పుడు ఇదే మాటను మనం రష్యా, ఉక్రెయిన్ దేశాలకు అన్వయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా వార్ శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను చమురు ధరలు నిండా ముంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.200 దాటింది. మరోవైపు నిత్యావసరాల […]
హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వాట్సాప్ చాటింగ్ చేసిన పాపానికి ఓ యువతి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతికి వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అయితే న్యూడ్‌గా చాటింగ్ చేయమని సదరు యువతిని యువకుడు కోరాడు. అతడి మాటల మత్తుకు పడిపోయిన యువతి న్యూడ్ చాటింగ్ చేసింది. కానీ కంత్రిగాడు న్యూడ్ ఛాటింగ్‌ను రికార్డు చేశాడు. అనంతరం న్యూడ్ ఛాటింగ్ రికార్డును అడ్డం పెట్టుకుని యువతిని సదరు […]
సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ పాటతో పల్లీల వ్యాపారి భుబన్ బద్యాకర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అయితే అతడు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్‌లో తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా భుబన్ బద్యాకర్ ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటనలో బద్యాకర్ ఛాతీకి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించారు. కాగా కచ్చా బాదమ్ […]
తెలంగాణలో పెండింగ్ ఛలాన్‌లు క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన డిస్కౌంట్ విధానానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. దీంతో తొలిరోజే 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్‌లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్‌లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు. అయితే తొలి రోజు లక్ష నుంచి 3 లక్షల మంది వరకు వాహనదారులు ట్రాఫిక్ ఛలాన్‌లు […]
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదివే పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకు ఒక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది యువకుడు ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… రాయవరం మండలం పసపూడికి చెందిన ఒకరు వ్యవసాయ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్న ఆయన కుమారుడు సెలవు రోజున ఇంటికి వచ్చాడు. తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులపై […]
నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం […]
సుప్రసిద్ధ నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి చలన చిత్రం సంస్థ నుండి ఓ యువ కథానాయకుడిని పరిచయం చేయబోతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటిని సాయి కొర్రపాటి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో గ్రాండ్ గా జరుగబోతోంది. కన్నడ చిత్రం ‘మాయాబజార్’ను తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్టర్. […]
సాధారణంగా వన్డే మ్యాచ్‌లలో సెంచరీ చేయడమే గొప్ప విషయం. అలాంటిది ఇప్పుడు ఆటగాళ్లు టీ20 మ్యాచ్‌లలోనూ అతి కష్టం మీద సెంచరీ పూర్తి చేస్తున్నారు. అది కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటేనే ఇది సాధ్యపడే విషయం. కానీ 10 ఓవర్ల మ్యాచ్‌లో ఓ ఆటగాడు సెంచరీ చేయడం అంటే మాములు విషయం కాదండోయ్. తాజాగా వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ టీ10 మ్యాచ్‌లోనూ సెంచరీ బాదేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. […]