జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతపురం నుంచి పవన్ తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లల్లో 1,857 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తొలి ఏడాది 1019 మంది, రెండో ఏడాది 838 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పవన్ తన పరామర్శ […]
నిబంధనలు ఉల్లంఘించిన మూడు సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. ఆర్‌బీఐ దృష్టికి రాకుండా కొన్ని బ్యాంకులు లోన్‌లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆర్‌బీఐ నిఘా పెట్టడంతో అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కోకన్ మెర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సమతా కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆదాయం, ఆస్తుల వర్గీకరణ తదితర […]
విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC […]
ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా యువ ఎంపీల కూతుళ్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమార్తెకు ప్రధాని మోదీ చాక్లెట్లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. కాగా అంతకుముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కుమార్తెకు […]
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు పలువురు డ్యాన్స్ వేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నాటు నాటు అంటూ సాగే పాటకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు డ్యాన్స్ చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన ఓ బాలుడితో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్‌లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. […]
పెంపుడు జంతువుల్లో కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. అందుకే చాలా మంది కుక్కలను ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇటీవల కుక్కలు చనిపోయినా తట్టుకోలేని వాళ్లు వాటి మీద ప్రేమతో అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ రైతు కుక్క కోసం గుడి కట్టేశాడు. ఇప్పటివరకు తమిళనాడులో హీరోయిన్‌లకు గుడి కట్టిన వాళ్ల గురించే విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు కుక్క కోసం గుడి కట్టడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదూ. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని శివగంగ […]
ఏపీలో విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక సమాచారం అందించింది. రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం నాడు ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్, జూలై 13న ఎడ్‌సెట్, లాసెట్, పీజీఎల్‌సీఈటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అంతేకాకుండా జూలై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్, జూలై 22న ఈసెట్, జూలై 25న ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. కాగా ఈఏపీసెట్‌కు సంబంధించి జూలై […]
మహిళల వన్డే ర్యాంకులను ఐసీసీ తాజాగా ప్రకటించింది. టాప్-10 ర్యాంకుల్లో ఇటీవల వన్డే ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా మహిళలు డామినేట్ చేస్తున్నారు. ఈ జాబితాలో టాప్-10లో ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా మహిళలే ఉండటం విశేషం. ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాటర్ల ర్యాంకుల్లో టాప్-1లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలీస్సా హిలీ నిలిచింది. ఆమె ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీతో రాణించింది. ప్రపంచకప్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆమె 509 […]
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోల్ పెట్టారు. ఈ పోల్ ద్వారా జగన్ ఢిల్లీ దేనికోసం వెళ్లారని ఆయన ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ ఆయన పోల్‌ను పోస్ట్ చేశారు. ఈ పోల్‌లో తొలి […]
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే గడపనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయనకు వైసీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, మాధవి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి, గురుమూర్తి, మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, సత్యవతి, కోటగిరి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ వరుసగా ప్రధానితో […]