చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరో యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌తో పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ అరోరా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తన స్వింగ్‌తో చెన్నై టాప్ ఆర్డర్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న చెన్నై ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీలను పెవిలియన్ పంపి ఆరంభంలోనే చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు.
దీంతో వైభవ్ అరోరా గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఈ క్రికెటర్ ఎవరు అని ఆరాలు తీస్తున్నారు. వైభవ్ అరోరా హర్యానా ఆటగాడు. డిసెంబర్ 14, 1997న జన్మించిన వైభవ్ అరోరా మూడేళ్ల క్రితం హిమాచల్ ప్రదేశ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. సౌరాష్ట్రపై తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. 2021లో టీ20ల్లో ఛత్తీస్‌గఢ్‌పై అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ నెట్‌బౌలర్‌గా పనిచేశాడు. గత సీజన్‌లో వైభవ్ అరోరాను కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకున్నా అతడికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.