Cooking Oil: విమానయాన రంగంలో సంచలనం.. వంటనూనెతో ప్రయాణించిన విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానయాన రంగంలో సంచలనం చోటు చేసుకుంది. వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది. అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్‌నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది.
ఎయిర్‌బస్ విమానం గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్‌ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది. మూడు గంటల ప్రయాణం తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 100 శాతం ఎస్‌ఏఎఫ్‌తో నింగిలోకి ఎగిరిన తొలి విమానంగా ఎయిర్‌బస్ ఏ-380 రికార్డులకెక్కింది. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయిన కాలంలో వంటనూనెతో ప్రయాణం అంటే చాలా ఖరీదుగానే భావించాలి. అందులోనూ ప్రస్తుతం పెట్రోల్ కంటే వంటనూనె ధరలే అధికంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ వంటనూనెతో విమానాలు ప్రయాణిస్తే విమానయాన రంగం ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
https://ntvtelugu.com/ntr-district-dream-fulfilled-fans-happy-moments/
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!