పాకిస్థాన్‌కు సొంతగడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో పాకిస్థాన్ కోల్పోయింది. మంగళవారం ముగిసిన మూడో టెస్టులో పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35 […]
Youtube: ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ యూట్యూబ్ వీడియోలతో కాలం గడిపేస్తున్నారు. దీంతో యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. చాలా భాషల్లో వాయిస్ సెర్చ్, టైపింగ్ వర్డ్స్ రూపంలో ఇంటర్నెట్ సెర్చ్ ఫెసిలిటీ తీసువస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఆడియో ట్రాక్ ఆప్షన్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఓటీటీల తరహాలో నచ్చిన ఆడియో […]
Minister AppalaRaju: ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే చిత్తూరు డైరీ మూతపడిందని.. అది తన ఘనతేనని చంద్రబాబు తన సక్సెస్ స్టోరీలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమూల్ లీజ్ పాలసీపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని.. అమూల్ ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో పాల రైతులు గతంలో చూడని ధరలు ఇప్పుడు […]
Sajjala: ఈనెల 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలు, మహిళల సాధికారత కోసం ప్రయత్నిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన గొప్ప నాయకుడు అని సజ్జల కీర్తించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వంటి అన్ని రంగాల్లో జగన్ కీలక మార్పులు తీసుకువచ్చారని ప్రశంసలు కురిపించారు. రాజకీయ, ఆర్ధిక, […]
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులందరూ ముద్దుగా అతడిని చెర్రీ అని పిలుచుకుంటారు. యంగ్ హీరోలలో మిగతా వారితో పోలిస్తే చెర్రీ చాలా స్టైలిష్‌గా ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా క్రేజ్ రావడంతో తన స్టైలింగ్ విషయంలో రామ్‌చరణ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులోనూ తండ్రి కాబోతుండటంతో చెర్రీ ఫేస్‌లోనూ గ్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ వాడే దుస్తులు, బట్టలు, యాక్సరీస్ గురించి సోషల్ […]
CPI RamaKrishna: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బుగ్గన అప్పులు తెస్తెనే …జగన్ బటన్ నొక్కే దౌర్భాగ్య పరిస్థితి ఉందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం దొంగలు మాత్రమే బాగున్నారని చురకలు అంటించారు. మూడున్నరేళ్లలో రైతుకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదని విమర్శలు చేశారు. కనీసం కడపలో పిల్ల కాలువను కూడా జగన్ తవ్వలేదన్నారు. జగన్ ఎక్కడికి […]
FIFA World Cup: ఖతార్ వేదికగా ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంతో ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కల కూడా నెరవేరింది. అర్జెంటీనా విజయం సాధించడంతో ప్రపంచంలోని పలు దేశాల్లో ఫుట్‌బాల్ అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో మన ఇండియాలోని కేరళ కూడా ఉంది. కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న శింబు అనే వ్యక్తి ఈ ఏడాది […]
Taj Mahal: ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి నోటీసులు జారీ చేశారు. తాజ్‌మహల్‌పై బకాయి ఉన్న రూ.1.4 లక్షల ఇంటి పన్ను చెల్లించాలని గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అది కొద్ది రోజుల క్రితమే అందింది. బకాయిలను క్లియర్ చేయడానికి ASIకి 15 రోజుల గడువు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పన్నును క్లియర్ చేయకుంటే తాజ్‌మహల్‌ను అటాచ్ చేస్తామని […]
CM Jagan: వచ్చే ఏడాది అమెరికాలో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాటా తెలుగు మహాసభలకు ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. నాటా అధ్యక్షుడితో పాటు పలువురు నాటా సభ్యులు సోమవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. తాము నిర్వహించే మహాసభలకు హాజరు కావాలంటూ ఆయన్ను ఆహ్వానించారు. నాటా తెలుగు మహాసభలు 2023 జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు అమెరికాలోని డల్హాస్‌లో జరగనున్నాయి. ఈ […]
OTT Updates: హీరోగా ఎన్నో సినిమాల తర్వాత అల్లరి నరేష్‌కు నాంది రూపంలో హిట్ దొరికింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో డిఫరెంట్ సబ్జెక్టులను అల్లరోడు ఎంచుకుంటున్నాడు. ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి […]