Minister AppalaRaju: ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే చిత్తూరు డైరీ మూతపడిందని.. అది తన ఘనతేనని చంద్రబాబు తన సక్సెస్ స్టోరీలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమూల్ లీజ్ పాలసీపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని.. అమూల్ ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో పాల రైతులు గతంలో చూడని ధరలు ఇప్పుడు కల్పిస్తున్నామని తెలిపారు. 2020 డిసెంబర్ నాటికి గేదె పాల ధర రూ.60-64గా.. ఆవు పాల ధర రూ.31-33 ఉండేదన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.35.20 చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read Also: China: చైనాలో నిమ్మకాయలకు భలే డిమాండ్.. కొవిడ్‌తో పోరాడుతున్న డ్రాగన్
ఏడాదిన్నర కాలంలో పాల రైతులకు సరాసరి ధర రూ.10 అధికంగా పెరిగిందని మంత్రి అప్పలరాజు అన్నారు. ఇంత కాలం రైతులకు రాకుండా మింగేసిన పాపం ఎవరిది అని నిలదీశారు. ఈ లెక్కలు తీస్తే చంద్రబాబు, ప్రైవేట్ డైరీల ఖాతాలోకి వెళ్లిన వేల కోట్ల రూపాయలు వెళ్లాయో తేలుతుందన్నారు. అమూల్ డైరీ లీజు గడువు 33 ఏళ్ళ నుంచి 99సంవత్సరాలకు పెంచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అమూల్ లీజ్ పాలసీపై అనవసర రాద్ధాంతం ఎందుకు అని సూటి ప్రశ్న వేశారు. ఏపీకి మొత్తం అప్పు కలిసి రూ.3.8 లక్షల కోట్లు అని కేంద్ర మంత్రి చెప్పారని.. కొన్ని మీడియా సంస్థలు దాన్ని వక్రీకరించి సుమారు 10 లక్షల కోట్ల అప్పు ఉందని రాశారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. తాను రూ.606 కోట్ల అవినీతి చేశానని కొన్ని మీడియా సంస్థలు ఆరోపించాయని.. అవి ఎక్కడ దాచానో కూడా చెప్తే ఆ డబ్బులు తాను తెచ్చుకుంటానని చురకలు అంటించారు.