CM Jagan: వచ్చే ఏడాది అమెరికాలో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాటా తెలుగు మహాసభలకు ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. నాటా అధ్యక్షుడితో పాటు పలువురు నాటా సభ్యులు సోమవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. తాము నిర్వహించే మహాసభలకు హాజరు కావాలంటూ ఆయన్ను ఆహ్వానించారు. నాటా తెలుగు మహాసభలు 2023 జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు అమెరికాలోని డల్హాస్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలకు డల్హాస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలవనుంది.
Read Also: Cockroach in Food: రైల్వే భోజనంలో బొద్ధింక.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘటన
కాగా తనను కలిసిన నాటా కార్యవర్గాన్ని సీఎం జగన్ పేరుపేరునా పలకరించారు. ఈ సందర్భంగా నాటా సభ్యులు సీఎం జగన్‌కు శాలువా కప్పి సన్మానించారు. తెలుగు మహాసభల ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు ఉన్నారు.