Chandra Babu: కడప జిల్లా కమలాపురంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ తరహాలో తాను ఒక రాష్ట్రం ముఖ్యమని.. అధికారం ముఖ్యమని చెప్పను అని.. తనకు తెలుగు జాతి ముఖ్యమని.. తెలుగు ప్రజలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. తెలుగు జాతి […]
IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఐపీఎల్ 2023 టైటిల్ లక్ష్యంగా అన్ని జట్లు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే మినీ వేలం ముగిసిన తర్వాత ఎప్పటి లాగానే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.16.25 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఓ ఆటగాడి కోసం చెన్నై ఇంత పెద్ద మొత్తంలో […]
IPL Auction 2023 Live Updates: ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లే రికార్డులు బ్రేకయ్యాయి. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరణ్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో శామ్ కరణ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. అటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ముంబై 17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు […]
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో సెలక్షన్ కమిటీని తొలగించింది. కొత్త సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సెలక్షన్ ప్యానల్‌లోని ఐదు పోస్టుల కోసం 600 ఈమెయిల్ అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఓపెన్ చేసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట కూడా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ […]
IND Vs BAN: మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో 87 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) సెంచరీలు మిస్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ రాణించకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్‌మన్ గిల్ (20) విఫలం అయ్యారు. స్టార్ ఆటగాళ్లు పుజారా (24), విరాట్ కోహ్లీ (24) రాణించలేకపోయారు. అయితే […]
CM Jagan: ఏపీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కింది. ట్విట్టర్ వేదికగా ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీఎం జగన్ అభిమానులు తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #HBDYSJagan అనే హ్యాష్ టాగ్‌తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్లతో 300 మిలియన్స్‌కు పైగా రీచ్‌తో ట్రెండ్ చేశారు. డిసెంబర్ 20 సాయంత్రం […]
Minister Roja: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జగనన్న క్రీడా సంబరాల బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు రూ.50 లక్షల ప్రైజ్ మనీని మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి అందజేశారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడల్లో ప్రతిభ చూపిన మెన్స్, ఉమెన్స్ టీమ్‌లకు ప్రైజ్ మనీ అందజేశారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. హీరోల కంటే జగనన్నే యంగ్‌గా ఉన్నారని.. క్రీడలు, యువత అంటే జగన్‌కు ఎంతో ఇష్టమని తెలిపారు. యువతకు […]
చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం.. భారత్‌లోకి ప్రవేశం చైనాలో కోవిడ్ -19 విజృంభనకు కారణం అవుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా భారత్ లో మూడు బీఫ్.7 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్.7 వేరియంట్ కేసులను బుధవారం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి బీఎఫ్.7 కేసును అక్టోబర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. చైనాలో తీవ్రమైన కోవిడ్ కేసులకు ఈ ఒమిక్రాన్ […]
DL Ravindra Reddy: కడప జిల్లా వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే అవినీతితో పాలన మొదలుపెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని, ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిజాయితీని ప్రశ్నించలేమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని డీఎల్ రవీంద్రారెడ్డి ఆకాంక్షించారు. […]
Free Smart Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నథింగ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నథింగ్ సంస్థ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా ఈ బ్రాండ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా స్మార్ట్ ఫోన్ పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ట్విట్టర్‌లో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. అందులో కేవలం తాము చేసిన ట్వీట్‌కు కామెంట్ చేస్తే సరిపోతుందని నథింగ్ కంపెనీ తెలిపింది. మీరు చేసిన […]