Social Media: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. దీంతో ఎక్కడ చూసినా లైక్, షేర్, కామెంట్ అనే మాట వినిపిస్తోంది. ఈ పేరుతో ఇప్పటికే సినిమా కూడా వచ్చేసిందంటే ఈ పేర్లకు ఉన్న మేనియా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అట్టర్‌ఫ్లాప్ సినిమాలోని ‘జంబలకిడి జారు మిఠాయ’ సాంగ్‌ను ట్రెండ్ సెట్టర్‌గా మార్చాలన్నా.. ఓ గుడ్డు ఫోటోకు వరల్డ్ రికార్డు కట్టబెట్టాలన్నా కేవలం సోషల్ మీడియా వల్లే సాధ్యం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]
Kapu Reservations: ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని, ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని […]
Andhra Pradesh: విశాఖ రైల్వేజోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు ఎలాంటి పరిమితి అంటూ లేదని వెల్లడించింది. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ రూపుదిద్దుకోబోతోందని రైల్వే బోర్డు పేర్కొంది. […]
Team India: టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ ర్యాంకుల్లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బంతి ఎటువైపు వేసినా సూర్యకుమార్ సిక్సర్లు దంచుతున్నాడు. వినూత్నమైన షాట్లతో అలరిస్తున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్‌తో పాటు యావరేజ్ కూడా ఎక్కువగానే ఉంటోంది. టీ20 క్రికెట్ తరహాలో సూర్యకుమార్ వన్డేల్లోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిడిలార్డర్లో అతడికి అవకాశం ఇస్తారని అంటున్నారు. Read […]
CM Jagan Birthday: ఏపీ సీఎం జగన్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో వైసీపీ నేతలు కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం జగన్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు […]
IPL Auction: ఈనెల 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించి మినీ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు. షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ […]
Telugu Desam Party: తెలంగాణలో డీలా పడ్డ టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కాస్త బలం ఉన్న ఖమ్మం వేదికగా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 21న ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ గ్రౌండ్‌లో టీడీపీ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. […]
Hyderabad: ఇటీవల కాలంలో విద్యార్థులు, చిన్నారులు మొబైల్‌లో గేమ్ ఆడేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. అయితే మొబైల్‌లో ఉండే పేమెంట్ యాప్స్, బ్యాంక్ యాప్‌లకు చాలా మంది సెక్యూరిటీ కోడ్‌లను పెట్టుకోవడం విస్మరిస్తున్నారు. దీంతో చిన్నారులు లేదా విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్ తీసుకుని గేమ్ ఆడిన సందర్భాలలో డబ్బులు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా తెలంగాణలో జరిగింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఫోన్ గేమ్‌లకు అలవాటు పడ్డ హర్షవర్ధన్ అనే […]
Avatar Mania: జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కాసులు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో పాటు పిల్లలను సృజనాత్మకంగానూ ప్రేరేపిస్తోంది. తాజాగా పుదుచ్చేరికి చెందిన విద్యార్థులు కొబ్బరి చిప్పలు, ఆకుల సహాయంతో అవతార్ సినిమాలోని పాత్రల బొమ్మలను తయారుచేసి ప్రశంసలు అందుకుంటున్నారు. సెలియమేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంతోష్, నవనీత్ […]
Andhra Pradesh: ఈనెల 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు విజయవాడలో ప్రభుత్వం ప్రత్యేకంగా క్రిస్మస్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. వేదికపై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఇతర నేతలు ఆశీనులు అయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. Read Also: Pakistan: ఇంగ్లండ్ చేతిలో క్లీన్ […]