Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులందరూ ముద్దుగా అతడిని చెర్రీ అని పిలుచుకుంటారు. యంగ్ హీరోలలో మిగతా వారితో పోలిస్తే చెర్రీ చాలా స్టైలిష్‌గా ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా క్రేజ్ రావడంతో తన స్టైలింగ్ విషయంలో రామ్‌చరణ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులోనూ తండ్రి కాబోతుండటంతో చెర్రీ ఫేస్‌లోనూ గ్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ వాడే దుస్తులు, బట్టలు, యాక్సరీస్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. లేటెస్టుగా చెర్రీ వాడుతున్న వాచీ, షూస్ హాట్ టాపిక్ అయ్యాయి. వాటి ధర గురించి తెలుసుకున్న నెటిజన్‌లు నోరెళ్లబెడుతున్నారు.
Read Also: Anchor Pradeep: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ పెళ్లి.. హాట్ టాపిక్ గా మారిన వధువు..?
చరణ్ వాడుతున్న వాచ్ కంపెనీ పేరు రిచర్డ్ మిల్లే. దీని ధర సుమారు 3 కోట్ల 34 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఆయన వాడే నైక్ కంపెనీ షూస్ ధర 3 లక్షల 60 వేలు ఉంటుందట. ఈ రేటు చూసి అభిమానులు వామ్మో అంటూ షాక్ తింటున్నారు. చరణ్ వాడే చెప్పుల ధర కూడా రూ. 50 వేలకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రామ్ చరణ్ గాగుల్స్ నుంచి వాచెస్ వరకు అన్నీ బ్రాండెడ్ అండ్ కాస్ట్‌లీనే వాడతాడని అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి RC 15 అనే వర్కింగ్ టైటిల్ వాడుకలో ఉంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.