ఏపీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరులో పెనువిషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన సతీష్ అనే ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. గూడూరు డీఆర్‌డబ్ల్యూ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే పరీక్షా కేంద్రానికి వచ్చినప్పుడే గేటు వద్ద తనకు ఛాతిలో నొప్పిగా ఉందని అక్కడి సిబ్బందితో సతీష్ చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం పరీక్షా కేంద్రంలోని గది వద్దకు చేరుకోగా విద్యార్థి సతీష్ గుండెపోటు […]
ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ తులసిరెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాడు బిగించడమే అని అభిప్రాయపడ్డారు. ఇది ఖచ్చితంగా ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అంటూ మండిపడ్డారు. రైతుల శ్రేయస్సు కోసం ఆనాడు వైఎస్ఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి […]
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపుతోంది. ఈనెల 7న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ ఈ చోరీకి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో విధులు ముగించుకుని బయటకు వచ్చే సమయంలో పరకామణిలో ఉద్యోగి వెంకటేశ్వరప్రసాద్ రూ.20వేలు నగదు చోరీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు […]
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రజలు ఇంజక్షన్‌ల రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. అయితే తాజాగా ట్యాబ్లెట్ రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఈ […]
సినిమా పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె ఎవరో కాదు… నమిత. ఈరోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోను పోస్ట్ చేసింది. ‘మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. […]
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు త్వరలోనే మీటర్లు ఏర్పాటుచేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 డిసెంబరు నుండి రైతుల బోర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావటంతో భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని రైతాంగంలో చర్చ మొదలైంది. మీటర్ల ఏర్పాటుకు అంగీకార పత్రాలపై రైతులు సంతకాలు చేయకుంటే ఉన్న కనెక్షన్లు తొలగిస్తామని పలు చోట్ల విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసి సంతకాలు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఏడు […]
అసలే పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతం అవుతున్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా కొనుగోలు చేసే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్ ట్యాక్స్ పెరగనుంది. ప్రస్తుతం వాహనం ధర రూ.50 వేల లోపు ఉంటే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12శాతంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి మోటర్ వాహనాల ట్యాక్సేషన్ చట్టం-1963లో 3, 6, 7వ షెడ్యూల్‌లోని […]
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర అధ్యక్షులు జానీ పాషా తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం నాడు కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. జూన్ 30లోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. విజయవాడలో సీఎం జగన్‌కు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని జానీ పాషా పేర్కొన్నారు. కాగా ప్రొబేషన్ ఖరారు చేసేందుకు అర్హులైన ఉద్యోగుల […]
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు కొన్నేళ్లుగా ‘అవతార్-2’ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2009లో హాలీవుడ్లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్సృష్టించిన గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’. ఈ మూవీకి పలు ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ఏకంగా 160 భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను దర్శకుడు జేమ్స్ కామెరాన్ విడుదల […]
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న ‘అసని’ బలహీనపడుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈరోజు తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడి ఆ తర్వాత దిశ మార్చుకుంటుందని వెల్లడించింది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర తీరానికి ముప్పు తప్పనుంది. కాగా ప్రస్తుతం తీవ్ర తుఫాన్ అసని కదలికలను ఉత్తరాంధ్ర యంత్రాంగం నిశితంగా గమనిస్తోంది. ఈ మేరకు ఎల్లో […]