ఐపీఎల్‌లో సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓ దశలో 200 స్కోరు చేసేలా కనిపించిన కోల్‌కతా తక్కువ పరుగులు చేసిందంటే దానికి కారణం బుమ్రా. అతడు 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఓ మెయిడిన్ సహా 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. […]
★ తిరుమల: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు.. నేడు గజ వాహనం పై ఉరేగింపుగా రానున్న శ్రీవారు.. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ ★ గుంటూరు: నేటి నుండి వాటర్ పైపుల మరమ్మతులు.. రెండు రోజుల పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్న కార్పొరేషన్ అధికారులు ★ నేడు తిరుపతి రూరల్ మండలంలో గంగ జాతర, […]
ఏపీలో పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ పొత్తుల మీదే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ప్రజాసమస్యలు వదిలేసి మూడు ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని.. ఇప్పటి నుంచే పొత్తుల గురించి చర్చలు ఎందుకుని హర్షకుమార్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ […]
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైసీపీ ఇంఛార్జి కొండారెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల-రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ సంస్థ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పులివెందుల-రాయచోటి మధ్య రోడ్డు పనులను కొండారెడ్డి అడ్డుకున్నారని.. చక్రాయపేట మండలంలో పనులు జరగాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు కన్‌స్ట్రక్షన్ సంస్థ కర్ణాటకలోని ఓ బీజేపీ […]
శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అత్యాచార కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 4న గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన ఓ షెడ్డులో తేజస్విని ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు తొలుత తేజస్విని మృతిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. […]
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు హెట్‌మెయిర్ స్వదేశానికి పయనం అయ్యాడు. అతడి భార్య ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మెయిర్ గయానాకు వెళ్లాడు. అయితే త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాను అత్యవసర పనిమీద తాను స్వదేశానికి వెళ్తున్నానని.. తన కిట్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూంలోనే ఉందని ఇన్‌స్టా్‌గ్రామ్ వేదికగా తెలియజేశాడు. కాగా ఈ […]
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనంతపురంలో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి వామపక్షాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పోరు గర్జనకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అటు సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమానికి వెళ్తున్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనంతపురంలో వామపక్షాల నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట […]
నెల్లూరు జిల్లాలోని పెన్నా, సంగం బ్యారేజ్ పనులను సోమవారం ఉదయం మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యారేజీలకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని .. ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయని తెలిపారు. 30 శాతం పనులు చేసి టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కాకాణి […]
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఏపీలోని రైతులు, కౌలు రైతుల పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతన్నను అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. అసని తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దైన ధ్యానం, పంట చేతికి వచ్చిన తరుణంలో నేలనంటిన వరి చేలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురుస్తుండటంతో […]
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్3. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా F3 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2019 సంక్రాంతి సీజన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన F2 మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, […]