Namita: తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. బేబీ బంప్ ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె ఎవరో కాదు… నమిత. ఈరోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోను పోస్ట్ చేసింది. ‘మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్’ అంటూ సదరు పోస్టులో నమిత రాసుకొచ్చింది.
సొంతం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నమిత.. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో జెమిని, రవితేజతో ఒకరాజు-ఒకరాణి, ప్రభాస్‌తో బిల్లా, బాలయ్యతో సింహా వంటి సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో కంటే తమిళంలో నమిత ఎక్కువగా నటించింది. తమిళంలో అయితే అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టేశారు. కెరీర్ కొంచెం నెమ్మదించాక 2017లో వ్యాపారి వీరేంద్ర చౌదరితో నమిత వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ కూడా కావడంతో పలువురు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
తాజావార్తలు
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!