Telangana: వాహనదారులకు ప్రభుత్వం షాక్.. లైఫ్ ట్యాక్స్ పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతం అవుతున్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్తగా కొనుగోలు చేసే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్ ట్యాక్స్ పెరగనుంది. ప్రస్తుతం వాహనం ధర రూ.50 వేల లోపు ఉంటే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12శాతంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి మోటర్ వాహనాల ట్యాక్సేషన్ చట్టం-1963లో 3, 6, 7వ షెడ్యూల్లోని వాహనాల లైఫ్ ట్యాక్స్‌ల్లో కొద్దిమేర మార్పులు చేశారు. కొత్త లైఫ్ ట్యాక్స్‌లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు.
నూతన నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల విషయంలో వాహనం ధర రూ.5 లక్షల లోపు ఉంటే 13 శాతం, రూ.5 లక్షల- రూ.10 లక్షల లోపు ఉంటే 14 శాతం, రూ.10 లక్షల – రూ.20 లక్షల లోపు ఉంటే 17 శాతం, రూ.20 లక్షలకు పైగా వాహనం ధర ఉంటే 18 శాతంగా లైఫ్ ట్యాక్స్‌ను అధికారులు నిర్ణయించారు.
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
అదే వాహనం కొనుగోలు చేసిన రెండేళ్ల లోపు అయితే.. వాహనం ధర రూ.5 లక్షల లోపు ఉంటే 12 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఉంటే 13 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు ఉంటే 16 శాతం, రూ.20 లక్షలకు పైగా ధర ఉంటే 17 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. వాహనం కొని ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ వాహన ధరపై లైఫ్ ట్యాక్స్ ఒక్కో శాతం తగ్గుతుంది.
ఒకవేళ వాహనం కొనుగోలు చేసి 12 ఏళ్లు దాటితే.. రూ.5 లక్షల లోపు వాహనం ధర ఉంటే 6.5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఉంటే 7.5 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు ఉంటే 10.5 శాతం, రూ.20 లక్షలకు పైగా ధర ఉంటే 11.5 శాతం లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి.
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..