అసని తీవ్ర తుఫాన్‌గా మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని తీర ప్రాంతానికి ముప్పు ఏర్పడింది. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణశాఖ అంచనాలను తలకిందులు చేస్తూ అసని తీవ్ర తుఫాన్ తన దిశను మార్చుకుని కాకినాడ తీరం వైపుకు దూసుకువస్తోంది. దీంతో కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో అధికారులు గ్రేట్ డేంజర్ సిగ్నల్-10 జారీ చేశారు. అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి […]
ఐపీఎల్‌లో మంగళవారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోరే చేసినా గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. 62 పరుగుల తేడాతో లక్నోపై ఘనవిజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 63 నాటౌట్, మిల్లర్ 26, రాహుల్ తెవాటియా 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్ […]
ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మంగళవారం నాడు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులుహైదరాబాద్‌లో అరెస్ట్ చేసి అనంతరం చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. అయితే పోలీసులు మోపిన అభియోగాన్ని మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. నారాయణ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి […]
★ అసని తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో నేడు జరగాల్సిన ఇంటర్ పరీక్ష ఈనెల 25కి వాయిదా వేసిన విద్యాశాఖ అధికారులు ★ ఏపీలో నేటి నుంచి వైసీపీ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు ★ తిరుమల: నేడు రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాలు.. ఈరోజు అశ్వ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు.. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ ★ పల్నాడు జిల్లా: నేడు నర్సరావుపేటలో […]
టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను ఆయన సొంత వాహనంలోనే పోలీసులు ఏపీకి తరలించారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ టెన్త్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు సంచలనం కలిగించాయి. సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర […]
ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై చర్చించేందుకు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మంత్రి బొత్స కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అన్ని జిల్లాల్లో పోలీసులు విచారణ చేపట్టారని మంత్రి బొత్స వెల్లడించారు. టీడీపీ నేతలు రాజకీయంగా మాట్లాడుతున్నారని.. పేపర్ లీకేజీ జరగలేదని టీడీపీ వాళ్లు చెప్పగలరా […]
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 నుంచి భువనేశ్వర్‌లో నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈనెల 26న భువనేశ్వర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ […]
మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో రాజధాని అమరావతికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు. ల్యాండ్ పూలింగ్ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. సోమవారం నాడే సీఐడీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ల్యాండ్ పూలింగ్ […]
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ సంచలన విషయాలు బయటపెట్టాడు. తమ జట్టు ఎంపికలో కోచ్‌తో పాటు సీఈవో వెంకీ కూడా పాల్గొంటారంటూ వ్యాఖ్యానించాడు. 11 మంది సభ్యుల తుది జట్టులో నీకు చోటు లేదంటూ మరో ఆటగాడికి చెప్పడం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు శ్రేయస్ అయ్యర్ గుర్తుచేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్ […]
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెన్త్ పరీక్షల సందర్భంగా రోజూ ఒకచోట పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం… అవన్నీ ఫేక్ న్యూస్ అని.. జరిగింది మాల్ ప్రాక్టీసే అంటూ పోలీసులు స్పష్టం చేయడం తెలిసిన విషయమే. కానీ పేపర్ లీక్ జరిగింది నిజమే అని ప్రస్తుత పరిణామాల ద్వారా అర్థమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్‌లు వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాట్సాప్ గ్రూప్‌లలో […]