ఏపీని అసని తుఫాన్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అసని తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ అత్యవసర సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్‌గా సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా తుఫాన్ బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు […]
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని 108 వాహనం ద్వారా బంధువులు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అయితే బాధితుడు రామకృష్ణకు సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు చికిత్స చేశారు. బాధితుడి తలకు కట్టు కట్టి సెలైన్లు పెట్టారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం ఇంజక్షన్ చేసి ఊరుకున్నాడు. దీంతో రామకృష్ణ పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన బంధువులు వెంటనే […]
అసని తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫాన్‌గా మారింది. దిశను మార్చుకున్న అసని మచిలీపట్నానికి 50కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతుండగా.. నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకే అవకాశముంది. అనంతరం కాకినాడ దగ్గర సముద్రంలోకి వచ్చి బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా విశాఖకు రావాల్సిన, వెళ్లాల్సి ఉన్న అన్ని విమానాలను […]
వయసు మళ్లినా కమల్ హాసన్ యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే కొంతకాలంగా హిట్ సినిమా కోసం కమల్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ విక్రమ్. ఈ సినిమాకు ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ టీజర్ నుంచి ఇటీవల విడుదలైన […]
ఏపీ తీరంలో అసని తీవ్ర తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. భయంకరమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అసని తీవ్ర తుఫాన్ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను అందుబాటులో ఉంచారు. అటు ఒంగోలు కలెక్టరేట్‌లో కూడా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266. చీరాల ఆర్డీవో కార్యాలయంతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో […]
ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనం కానుంది. త్వరలోనే భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మరోవైపు ఈ ఏడాదంతా టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపబోతోంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఇది ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో […]
అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో ఈరోజు ప్రభుత్వం తలపెట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే తుఫాన్ కారణంగా ఈరోజు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని అధికారులు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను శుక్రవారం రోజే జమ చేయనున్నారు. కాగా గురువారం నాడు ఏపీ […]
ఏపీ తీరంలో అసని తీవ్ర తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. అటు రైల్వేశాఖ కూడా తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీలో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి.. కొన్ని […]