Football Player Pele: 20వ శతాబ్దంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే అందరూ పీలే పేరు చెప్పి తీరాల్సిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. పీలే మరణంపై ఫిఫా కూడా సంతాపం తెలిపింది. పీలే మరణ వార్త విన్న తర్వాత జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలో అన్ని దేశాల జెండాలను కిందకు దించి ఎగరేసింది. పుట్‌బాల్ ప్రపంచానికి పీలే మరణం తీరని లోటు అని ఫిఫా పేర్కొంది. అనంతరం ఫిఫా కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక ఫుట్‌బాల్ స్టేడియానికి పీలే పేరు పెట్టాలని ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో సూచించారు. ఈ మేరకు అన్ని దేశాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Read Also: Parliament Budget Session : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
కాగా ఫుట్‌బాల్ చరిత్రలో మూడు సార్లు ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన ఏకైక ఆటగాడు పీలే. తాజాగా ముగిసిన ఫిఫా వరల్డ్ కప్‌లో కూడా బ్రెజిల్ ఆటగాళ్లు పీలేను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో కేన్సర్‌తో పోరాడుతున్న పీలే త్వరగా కోలుకోవాలంటూ బ్యానర్‌తో ప్రదర్శన చేశారు. కానీ 82 ఏళ్ల పీలే కేన్సర్‌తో పోరాడుతూ గత సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. బంతి మైదానంలో పారాడితే కాళ్లతో డ్రిబ్లింగ్… గాల్లో ఉంటే ఛాతీతో కంట్రోల్.. గోల్‌పోస్ట్ వద్ద ఎగిరొస్తే హెడర్.. కింది నుంచి పాస్ అయితే చక్కని కిక్ షాట్… ఇలా బంతి ఎటునుంచి వచ్చినా.. తన చుట్టు అడుగడుగునా ప్రత్యర్థులు మాటువేసినా.. డిఫెండర్లు గోడ కట్టినా.. గోల్ కీపర్ కంచెలా నిలుచున్నా.. పీలే కచ్చితమైన లక్షిత షాట్‌ను ఎవరూ అడ్డుకోలేదు. అంతటి నైపుణ్యం పీలే సొంతం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.