Sourav Ganguly Tweet Misfire: బర్మింగ్ హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుపై 9 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో స్వర్ణ పతకం దూరమైంది. అయితే సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను మహిళల జట్టు గెలవలేకపోయింది. ఒత్తిడి కారణంగా 12 బంతుల్లో 17 పరుగులు చేయలేక చతికిలపడింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఓ ట్వీట్ ద్వారా ప్రస్తావించాడు. […]
Ambati Rambabu: గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు దిగువ ప్రాంతాలకు వచ్చే […]
Nara Lokesh: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ వెల్లడించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో..? ఏది రియలో..? ప్రజలే తేలుస్తారని లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీ మాధవ్ వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఎలా తేల్చారని ప్రశ్నించారు. అంటే ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని నిలదీశారు. అనంతపురం ఎస్పీ ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టా అంటూ లోకేష్ […]
Gorantla Madhav: ఓ మహిళతో నగ్నంగా తాను మాట్లాడిన వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీనే నిర్ధారించారని.. ఈ వీడియో మార్ఫింగ్ అని తాను ఆనాడే చెప్పానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలు ఎదుగుతుంటే చూసి […]
Ananthapuram SP Fakirappa: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ వీడియో కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఈ వీడియోను మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని ఆయన తెలిపారు. ఎక్కువసార్లు షేర్ కావడం వల్ల అసలైందా, నకిలీదా తేల్చడం కష్టమని చెప్పారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు దీన్ని నిర్ధారించలేమన్నారు. తొలుత itdp వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోను పోస్ట్ చేశారని ఎస్పీ ఫకీరప్ప […]
AP ECET Results: ఏపీ ఈసెట్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 91.44గా, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 95.68గా నమోదైనట్లు తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారికి బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి జేఎన్టీయూ ఆధ్వర్యంలో జులై 22న ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించారు. ఈసెట్ పరీక్షకు మొత్తం 36,440 మంది […]
Raksha Bandhan 2022: శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండగ అక్కాతమ్ముళ్లు.. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాటి చెప్తుంది. అయితే ఈ ఏడాది రక్షాబంధన్‌కు సంబంధించి అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. కొందరు పండగ ఈనెల 11వ తేదీ అంటుంటే.. మరికొందరు ఈనెల 12వ తేదీ అని వాదిస్తున్నారు. దీంతో తమ సోదరితో రాఖీ ఎప్పుడు కట్టించుకోవాలో తెలియక చాలామంది అయోమయంలో ఉన్నారు. అయితే పంచాంగం ప్రకారం చూసుకుంటే.. పౌర్ణమి ఘడియలు ఆగస్టు 11న గురువారం ఉదయం 10:37 […]
Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు. […]
Shikar Dhawan Allegations on Team Selection: ఈనెల 18 నుంచి జింబాబ్వేలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌కు తనను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేయడం లేదో అర్ధం కావడం లేదన్నాడు. అయితే ఈ విషయం గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని.. వచ్చిన అవకాశాల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఎలా […]
Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన తరపున చేనేత కళాకారులకు కళాభివందనాలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చేనేత కోసం జాతీయ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కళను నమ్మిన వారు అర్ధాకలితో జీవిస్తుండటం దురదృష్టకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెరవక కొందరు చేనేత కళను సజీవంగా నిలుపుతున్నారని కొనియాడారు. కళారంగంపై లోతైన అధ్యయనం జరగాలని, కళాకారులకు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉండాలన్నారు. దేశంలో ప్రతి కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత […]