Vangalapudi Anitha: జాతీయ మహిళా కమిషన్‌కు టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత గురువారం నాడు ఓ లేఖ రాశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ సహా ఏపీలో పెద్ద ఎత్తున మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని లేఖలో అనిత వివరించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని ఆమె కోరారు. మహిళలపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ లేఖలో స్పష్టం చేశారు. బాధిత మహిళల వివరాలను […]
Annamayya District: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో ఓ అత్త అతి క్రూరంగా ప్రవర్తించింది. కోడలి తల నరికి.. ఆ తలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులకు లొంగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కె.రామాపురంలో అత్త సుబ్బమ్మ, కోడలు వసుంధరకు కొంతకాలంగా పడటం లేదు. తరచూ కుటుంబంలో ఇద్దరికీ విభేదాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు మరోసారి అత్తాకోడళ్ల మధ్య వార్ చోటు చేసుకుంది. దీంతో […]
Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. ఆగస్టు 13న వర్కింగ్ డేగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13న రెండో శనివారం సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు స్కూళ్లలో డ్యాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేయడం […]
Girls Black Mailing in soicial media: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లోనే కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కొందరు యువతులు కొందరు అబ్బాయిల నంబర్లను సంపాదించి వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. వాట్సాప్ ఛాటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు యువతులు చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్‌లు వైరల్ అవుతున్నాయి. వీడియోలను ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీ […]
Salman Khan in Vishakapatnam: బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విశాఖలో సందడి చేశాడు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాఖకు వచ్చిన హీరో సల్మాన్ ఖాన్.. షూటింగ్ విరామ సమయంలో నేవీ సిబ్బందితో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండియన్ నేవీ తూర్పు కమాండ్ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ డ్యాన్సులు వేశాడు. అనంతరం నేవీ సిబ్బందితో కలిసి కిచెన్‌లో వంట చేశాడు. అంతేకాకుండా […]
Mahendra Singh Dhoni: ఇండియాలో ఐపీఎల్ టోర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌కు ప్రపంచంలో ఎక్కడ లేనంత క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కూడా ఐపీఎల్ తరహాలో ఓ టోర్నీని నిర్వహించాలని తలపెట్టింది. ఈ మేరకు ఈ టోర్నీలోకి పలు దేశాల స్టార్ ఆటగాళ్లను ఆహ్వానిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దక్షిణాఫ్రికా […]
Constable Crying: యూపీలోని ఫిరోజాబాద్‌లో ఓ కానిస్టేబుల్ చేతిలో భోజనం పళ్లెం పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా ఆకలితో ఉన్నానని, అధికారులు పట్టించుకోవట్లేదని అతడు వాపోయాడు. జంతువులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినలేవని, అలాంటి రొట్టెలు తమకు ఇస్తున్నారని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంటికి దూరంగా […]
Central Government: ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో పన్నులను అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రెండో విడత పన్నుల వాటాను విడుదల చేసింది. తొలి వాటా కింద దేశంలోని […]
Vangalapudi Anitha: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిపోర్టుపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అనుకున్నట్లే జరిగిందని.. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్‌కు సచ్చీలుడు అన్న సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మహిళల […]
Farmer Got Diamond: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్ట దేవత వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం లభించింది. జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు తనకు ఉన్న పొలంలో టమోటా పంటను పండించాడు. ఈ సందర్భంగా చేనులో కలుపు తీసే పనులు చేస్తుండగా కళ్లు మెరిసిపోయేలా ఓ రాయి కనిపించింది. ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా వజ్రం అని స్పష్టమైంది. సదరు వజ్రం 10 క్యారెట్లు ఉన్నట్లు రైతు నిర్ధారణ చేసుకున్నాడు. […]