Shikar Dhawan Allegations on Team Selection: ఈనెల 18 నుంచి జింబాబ్వేలో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌కు తనను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేయడం లేదో అర్ధం కావడం లేదన్నాడు. అయితే ఈ విషయం గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని.. వచ్చిన అవకాశాల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలనే దానిపైనే దృష్టి సారిస్తానని ధావన్ వెల్లడించాడు. ఐపీఎల్ అయినా.. దేశవాళీ క్రికెట్ అయినా.. టీమిండియాకు అయినా చోటు దక్కినప్పుడు బాగా రాణించాలని భావిస్తానని.. అదొక్కటే తన చేతుల్లో ఉందని అభిప్రాయపడ్డాడు.
Read Also:Sea Waves: తీరప్రాంతంలో అలజడి.. హుదూద్ తర్వాత ఆ స్థాయిలో విరుచుకుపడుతోన్న అలలు..
అయితే తాను చాలా కాలంగా టీమిండియాకు టీ20 ఫార్మాట్‌లో ఆడటం లేదని.. నిజాయితీగా ఆలోచిస్తే తనను టీ20లకు ఎందుకు ఎంపిక చేయడం లేదో తెలియడం లేదని ధావన్ అన్నాడు. అసలు తనను ఏ ఫార్మాట్‌లో ఎంపిక చేస్తారో కూడా తనకు తెలియదని ధావన్ వ్యాఖ్యానించాడు. అటు తనకు వన్డే క్రికెట్ ఆడటం చాలా ఇష్టమన్నాడు. ఇది కళాత్మక ఫార్మాట్అని… టెస్టు, టీ20లకు వాటి విలువలున్నట్లే, వన్డే క్రికెట్ కూడా దానికంటూ ఓ ప్రత్యేక విలువ ఉందని…ఈ ఫార్మాట్ ఎంతో ఉత్తేజకరంగా ఉంటుందని ధావన్ పేర్కొన్నాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో తనకు గొప్ప అనుబంధం ఉందన్నాడు. రాహుల్ ద్రవిడ్‌తో కూడా తన కెమిస్ట్రీ బానే ఉందని.. ఆయనతో కలిసి పనిచేయడం పట్ల సంతోషంగా ఉన్నానని ధావన్ వివరించాడు.