Friendship Day 2022: సృష్టిలో దేవుడు మనుషులందరితో బంధాలు సృష్టిస్తాడు. అయితే మనకు తెలియకుండానే ఏర్పడే బంధం ఫ్రెండ్‌షిప్ ఒక్కటే. ఎవరు ఎప్పుడు మనకు స్నేహితులు అవుతారో మనకే తెలియదు. కులమతాలకు అతీతంగా, పేద, ధనిక అనే తేడా లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం పుడుతుంది. కొంతమంది స్నేహితులు ప్రాణానికి ప్రాణంలాగా నిలుస్తారు. అన్ని విషయాల్లోనూ తోడుగా నిలుస్తారు. ఏ కష్టంగా వచ్చినా ఆదుకుంటారు. కష్టసమయంలో కలత చెందిన మనసుకు ప్రశాంతతను కలిగించే దివ్యమైన ఔషధం […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. నేడు షార్ వేదికగా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో తొలి రాకెట్ ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం మైక్రోశాట్-2ఏతోపాటు దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జి […]
శ్రావణ మాసం పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రెండో శ్రావణ ఆదివారం నాడు శ్రీసూర్య స్తోత్ర పారాయణం చేస్తే ఆయురారోగ్యాలు మీ ఇంటిల్లిపాదికీ చేకూరుతాయి. https://www.youtube.com/watch?v=PPe1BaN2Dvs&feature=youtu.be
IND Vs WI: రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 […]
What’s Today: * శ్రీహరికోట: నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం.. షార్ నుంచి ఉదయం 9:18 గంటలకు ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు.. కక్ష్యలోకి చేరనున్న మైక్రోశాట్-2ఏ, ఆజాదీ శాట్ * ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ సమావేశం.. హాజరుకానున్న ఏపీ సీఎం జగన్.. సమావేశాన్ని బహిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ * తిరుమల: ఇవాళ శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజులు పాటు పవిత్రోత్సవాలు.. రేపటి నుంచి మూడు రోజులు పాటు […]
Honeymoon Record: సాధారణంగా ఓ జంట వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి హనీమూన్‌కు వెళ్లడమే గగనం. ఆర్ధిక పరిస్థితులు బాగుంటే కొందరు రెండు, మూడు సార్లు హనీమూన్ కూడా వెళ్తుంటారు. ఈ లోపే సంతానం కలిగితే హనీమూన్‌కు ఎండ్ కార్డు పడుతుంది. కానీ అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఆనీ, మైక్ హోవార్డ్ జంట రికార్డు స్థాయిలో హనీమూన్ కొనసాగిస్తోంది. 2012లో పెళ్లి చేసుకున్న వీరు ఇప్పటివరకు 64 దేశాల్లో ఎంజాయ్ చేసి ప్రస్తుతం ఇండియాలో విహరిస్తున్నారు. […]
Modi, Chandrababu Meeting: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులతో చంద్రబాబు ముచ్చటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ భేటీకి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కమిటీ సమావేశానికి రావాలంటూ చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో శనివారం […]
F2F With TammaReddy Bharadwaja: ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంక్షోభానికి నిర్మాతలే కారణమని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. ఎన్టీవీ ఆయనతో ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ వక్రమార్గం తీసుకుందని తమ్మారెడ్డి అన్నారు. గత ఐదేళ్లుగా […]