Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు. ఈ నేపథ్యంలో ఈ ట్రైన్ ట్రయల్ రన్‌ను తాజాగా రైల్వే శాఖ నిర్వహించింది.
Read Also: National Lazy day: బద్దకం మంచిదే కానీ.. అతి బద్దకం యమ డేంజర్
EIR-21 రైలు అతి పురాతనమైనది. 1855లో ఈ రైలును ఇంగ్లండ్‌లో తయారుచేశారు. ఈ రైలు ఆవిరితో నడుస్తుంది. బ్రిటీష్ పాలనలో 1909 వరకు ఈ రైలును అధికారులు నడిపించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ రైలును హౌరాలోని జమాల్‌పూర్‌లో ప్రజల సందర్శనార్థం కోసం ఉంచారు. ప్రపంచంలోని ఇది అతి పురాతన రైలు అని చెప్పడానికి దీనిని ప్రదర్శన కోసం హౌరాకు ఈ రైలును తరలించారు. ప్రస్తుతం చెన్నై మెట్రో సిటీ పెరంబూర్ లోకోమోటివ్ వర్క్స్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ రైలును గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో బయటకు తీసుకువచ్చి చరిత్రను ప్రజలకు చాటి చెప్పేందుకు నడిపిస్తుంటారు.
The trial run of the 1855 manufactured EIR-21, which was the first loco to haul a train from Howrah to Delhi in 1866. There will be a run on August 15th on the occasion of #AzadiKaAmritMahotsav! #IndianRailways #heritage pic.twitter.com/1U3DnhOP0p
— Ananth Rupanagudi (@Ananth_IRAS) August 9, 2022