* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష.. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ
* తిరుమల: నేడు ఉ.9 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల.. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు సంబంధించిన టిక్కెట్ల కోటా విడుదల
* విశాఖ: నేటి నుంచి సింహాచల దేవస్థానంలో ధారోత్సవాలు.. ఈనెల 13 వరకు ఆర్జిత నిత్య కళ్యాణం రద్దు
* నేటి నుంచి బీఎస్-3, బీఎస్-4 డీజిల్ వాహనాలపై తాత్కాలిక నిషేధం
* హైదరాబాద్: నేడు జీహెచ్ఎంసీ ఆఫీసులో మంత్రుల కీలక సమావేశం.. భేటీ కానున్న కార్పొరేటర్లు, అధికారులు.. రెండో విడత కంటి వెలుగు నిర్వహణపై చర్చ.. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఇంట్లో వారిని కలిసేలా ప్లాన్
* నేటి నుంచి భారత్ వర్సెస్ శ్రీలంక మూడు వన్డేల సిరీస్.. నేడు గౌహతి వేదికగా తొలి వన్డే.. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* నేటి నుంచి మలేషియా ఓపెన్.. తొలి రౌండ్‌లో కరోలినా మారోన్‌తో తలపడనున్న పీవీ సింధు