నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కోసం రేవంత్ కోరుకొండ తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. ”ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని, అలానే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన తొలిగీతం నమః శివాయకు […]
సుప్రీమ్ హీరో సాయితేజ్ ఇటీవల జరిగిన రోడ్ యాక్సిడెంట్ నుండి నిదానంగా కోలుకుంటున్నాడు. దాంతో అతని తాజా చిత్రం ‘రిపబ్లిక్’ మూవీ విడుదలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ మూవీని అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు సినిమా సెన్సార్ ను కంప్లీట్ చేశారు. తమ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించిందని, ముందు అనుకున్న విధంగానే గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1న మూవీని విడుదల చేస్తామని […]
కరోనా తర్వాత ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు పరుగుపెడుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులో రాబోతోంది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మెప్పు కోసం హాట్ స్టార్ ప్రణాళికలను సిద్దం చేసింది. స్టార్ హీరోల సినిమా హక్కులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు […]
టాలీవుడ్ లో యాడ్స్ రంగంలో మహేశ్ బాబుకు ఎదురు లేదనే చెప్పవచ్చు. మహేశ్ చేసిన, చేస్తున్నన్ని ప్రకటనలు మరే హీరో చేయటం లేదు. టాప్ బ్రాండ్స్ అన్నీ ప్రచారం కోసం మహేశ్ ముంగిట్లోనే వాలుతున్నాయి. ఇటీవల పాన్ బాహర్ యాడ్ లో తళుక్కుమన్న మహేశ్ ఫ్లిఫ్ కార్డ్ వారి లేటెస్ట్ యాడ్ లో మెరిశాడు. ప్రముఖ ఇ-కామర్స్ బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్ గతంలో మహేశ్ తో ప్రకటన చేసినప్పటికీ తాజాగా మరో యాడ్ రూపొందించింది. అది ఆన్ లైన్ […]
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఇందులో చరణ్ కి జోడీగా నటిస్తోంది ఆలియా. అయితే ఆలియా టాలీవుడ్ లో మరో సినిమాకు ఓకె చెప్పిందట. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియా నటించబోతోందట. ఎన్టీఆర్ నటిస్తున్న 30 వ చిత్రమిది. దీని కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడు కొరటాల. ఎప్పటిలాగే తనదైన సోషల్ మెసేజ్ మిస్ కాకుండా పవర్ […]
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే.. కాగా, తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో నామినేషన్లు […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ కు భారీ ఊరట లభించింది. పూరి, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చేసింది. పూరి, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లును రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షించారు. 2017 జులైలో పూరి, తరుణ్ నుంచి నమూనాలను ఎక్సైజ్ శాఖ సేకరించిన విషయం తెలిసిందే. స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ పేర్కొంది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు […]
పవన్ కళ్యాణ్, రానాతో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ నుంచి ఐశ్వర్యా రాజేశ్ తప్పుకుందట. ఇందులో ఐశ్వర్య రానాకి భార్య పాత్రలో నటించవలసి ఉంది. అయితే డేట్స్ సమస్య వల్ల తప్పుకున్నట్లు ప్రచారంలో ఉన్నప్పటికీ నిజానికి పవన్ భార్య పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ తో పోలిస్తే తన పాత్ర పరిధి చాలా తక్కువగా ఉన్నందువల్లే ఐశ్వర్య డ్రాప్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. తమిళంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ ఇటీవల కాలంలో తెలుగులోనూ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో చరణ్ హోస్ట్ నాగార్జున సమక్షంలో సీజన్ 5 పోటీదారులతో ఇంటరాక్ట్ అవుతాడట. చరణ్ పాల్గొనే ఎపిసోడ్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దబోతున్నారట. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్స్ లో చరణ్ ఎప్పుడూ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వలేదు. ఇదే తొలిసారి. చరణ్ ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ ఎపిసోడ్‌లో […]