మంచి కంటెట్‌తో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే హీరోగా శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిలో నిలిచారు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తనకంటూ టాలీవుడ్‌లో ఓ మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు శ్రీవిష్ణు.. ఆయన ఇటీవలే నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం నేటికీ 30 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్బంగా చోరుడికి రాజ మార్గం!… అంటూ శ్రీవిష్ణు […]
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేస్తూ కంటిపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు… ఆ గాయం నుండి కారుతున్న రక్తం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ & టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రాగా, విడుదలైన మొదటి పాట కూడా రికార్డ్స్ సాధించింది. ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. […]
టాలీవుడ్ నటుడు నితిన్ నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేడు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది. రీమేక్ చిత్రమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇదిలావుంటే, నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకోగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. అయితే మరో కథానాయికగా నిధి అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమెను సంప్రదించి […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ..’ ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి హిట్ సినిమాలు రాగా.. హ్యట్రిక్ చిత్రంగా వస్తున్న ‘అఖండ’పై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా కోసం ఆసక్తిగా […]
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దొంగ ఒక పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ ‘చీప్ ‘ రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, నేడు సాయితేజ్‌ని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయితేజ్‌కి యాక్సిడెంట్ జరిగినప్పుడు బన్నీ కాకినాడలోని ‘పుష్ప’ షూటింగ్‌లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సాయితేజ్ ఆరోగ్యాన్ని తెలుసుకున్న బన్నీ.. హైదరాబాద్ వచ్చిన వెంటనే పరామర్శించారు. ఈ నెల 10న […]