మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో చరణ్ హోస్ట్ నాగార్జున సమక్షంలో సీజన్ 5 పోటీదారులతో ఇంటరాక్ట్ అవుతాడట. చరణ్ పాల్గొనే ఎపిసోడ్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దబోతున్నారట. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్స్ లో చరణ్ ఎప్పుడూ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వలేదు. ఇదే తొలిసారి. చరణ్ ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ ఎపిసోడ్‌లో పాల్గొన్నాడు. నిజానికి స్టార్ గ్రూప్ అనుబంధ సంస్థ డిస్నీ హాట్‌స్టార్ కి చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో వారి కోరిక మేరకు బిగ్ బాస్ లో అతిథిగా కనిపంచబోతున్నాడు.
ఇదిలా ఉంటే చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ తో కలసి నటించాడు. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం దర్శకుడు శంకర్‌తో కలసి పని చేస్తున్నాడు. ఇందులో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.