‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల కాంబోలో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిచేసుకొని తారక్ ఉండగా.. కొరటాల ఆచార్య విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే తారక్-కొరటాల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలాకాలమే అవుతున్న మిగితా అప్డేట్స్ ఏమి రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ […]
(సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు) “నా రూటే సెపరేటు” అంటూ సాగుతున్న నటదర్శకరచయిత ఉపేంద్రకు కన్నడనాట తరగని క్రేజ్! తెలుగునేలపైనా ఉపేంద్రకు ఉన్న ఆదరణ తక్కువేమీ కాదు. నలుగురు నడచిన బాటలో కాకుండా, తనదైన పంథాలో పయనించి నలుగురినీ మెప్పిస్తున్న ఘనుడు ఉపేంద్ర. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా ఉపేంద్ర పలు పాత్రలు పోషిస్తూనే జనాన్ని ఆకట్టుకుంటున్నారు. డొంక తిరుగుడు లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడటం ఉపేంద్ర నైజం. అందుకే ఆయన సినిమాల్లోనూ ఆ విలక్షణం కనిపిస్తూ ఉంటుంది. […]
(సెప్టెంబర్ 18న షబానా ఆజ్మీ బర్త్ డే) దేశం గర్వించదగ్గ నటీమణుల్లో షబానా ఆజ్మీ అగ్రస్థానంలో నిలుస్తారు. సమాంతర సినిమా మన దేశంలో వెలుగులు విరజిమ్మడంలో షబానా ఆజ్మీ అభినయం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘అంకుర్’తోనే జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ, తరువాత నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా ‘హ్యాట్రిక్’ చూశారు. మొత్తం ఐదుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ మన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు […]
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’.. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అక్కినేని హీరో అఖిల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తాజాగా ఆమె డబ్బింగ్ ను ప్రారంభించిన విషయాన్నీ తెలియజేస్తూ ట్వీట్స్ చేసింది. లవ్ సీన్స్ లో అఖిల్- పూజా హెగ్డే మధ్య […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్3’.. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రంలో ఈసారి సునీల్, అలీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ‘ఎఫ్3’ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సెట్‌లో జరిగిన సరదా సన్నివేశాలను ‘ట్రిపుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అంటూ వీడియో విడుదల […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కొంతమంది సెలెబ్రిటీలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్స్, మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ సాగింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ కు ఉచ్చుబిగుస్తోంది. కెల్విన్ కీలక నిందితుడిగా ఈడీ అధికారులు గుర్తించారు. తాజాగా డ్రగ్స్ కేసులో కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని రంగారెడ్డి జిల్లా కోర్టు కెల్విన్ ను […]
సంగీత దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని, ఆ తర్వాత హీరోగా మారాడు. ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ హిట్ మూవీతో తెలుగువారికీ చేరువయ్యాడు. అప్పటి నుండి అతని ప్రతి తమిళ చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అలా తమిళంలో రూపుదిద్దుకున్న ‘కోడియిల్ ఒరవన్’ ఈ శుక్రవారం తెలుగులో ‘విజయ రాఘవన్’గా విడుదలైంది. ‘మెట్రో’ ఫేమ్ ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు వారి ముందుకు రవిచంద్రారెడ్డి, శివారెడ్డి తీసుకొచ్చారు. అరకు సమీప గ్రామంలో […]
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జరగనుండగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘లవ్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సంస్థ చేరింది. డిస్నీ+హాట్ స్టార్‌కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోన్నారని సమాచారం. అయితే తాజాగా చెర్రీ చేసిన పోస్ట్ దానికి సంబంధించినదై ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ కు కూడా ప్రత్యేకమైన ప్రమోషనల్ బాధ్యతలు తీసుకోనున్నారట. ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన ఒక యాడ్ కూడా […]