కరోనా తర్వాత ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు పరుగుపెడుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులో రాబోతోంది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మెప్పు కోసం హాట్ స్టార్ ప్రణాళికలను సిద్దం చేసింది. స్టార్ హీరోల సినిమా హక్కులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఇవి కాకుండా ఐపిఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ కప్ 2021ను కూడా తెలుగు వారికి అందిస్తోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌ను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో హాట్ స్టార్ ప్రవేశంతో టాలీవుడ్ మేకర్స్ తో పాటు నటీనటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని అన్నారు.