శుక్రవారం విడుదలైన తమిళ యంగ్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘కర్ణన్’ బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతోంది. తొలిరోజు 10.40 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు 5.50 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. శుక్రవారం థియేటర్లలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉండగా, శనివారం నుండీ తమిళనాడు ప్రభుత్వం దీనిని 50 శాతంకు తగ్గించింది. దాంతో కలెక్షన్లు సగానికి సగం తగ్గాయి. అదే ఆదివారం కాస్తంత పుంజుకుని రూ. 6.50 కోట్లను కలెక్ట్ చేసింది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. అయితే ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో రచ్చ మొదలైన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులుముకున్న ఈ కాంట్రవర్సీపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్… పవన్ కళ్యాణ్‌కు భయపడే వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షోలకు […]
సాయికుమార్ తనయుడు ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శశి’. ఇందులో సురభి, రాశీసింగ్ హీరోయిన్స్. ఈ నెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘ఒకే ఒక లోకం’ పాట విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ను 10 తేదీ ఉదయం పదిగంటల పది నిమిషాలకు పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సినిమా అందరికీ సుపరిచితమే. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హందీ రీమేక్‌లో బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ నటించారు. హిందీలో అజయ్ దేవగన్ కూడా అదే తరహాలో పవర్ ఫుల్‌గా చేశారు. అయితే తాజాగా సింగం 3 సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రగా చేస్తోంది అజయ్ కాదంట. […]
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో రవితేజ కెరీర్ హిట్ అందుకున్నారు. అదే జోరుతో తాజాగా ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అమృతా అయ్యర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రవితేజ 68 గా ప్రచారం అవుతోంది. ఈ చిత్రాన్ని దర్వకుడు […]
సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమాను విడుదల చేసి ఏడాది అవుతుంది. ఆ గ్యాప్‌ను కవర్ చేయాలని మహేష్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వరుస సినిమాలను ఓకే చేస్తూ మహేష్ దూకుడు కనబరుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈసినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తన సినిమాను రాజమౌళితో చేయనున్నారంట. వీరి కాంబోలో […]
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ మరో వైపు రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఎందరో ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రన్‌బీర్ కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్నాయి. అతడితో పాటు అతడి తల్లి నీతు కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారని టాక్ నడుస్తోంది. […]
బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా కనుమరుగవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక్కటి వస్తే గొప్ప. సరైన కథ కుదరకనో, హీరోల మధ్య విభేధాల కారణంగానో తెలియదు కానీ మల్టీస్టారర్ సినిమాలు రావడం మాత్రం తగ్గిపోయింది. అయితే మన ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం మొదలైంది. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ సినిమా తెరకెక్కించేందుకు ఇక్కడి హీరోలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ […]