తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కావు… గ్లామరస్ జీవితాలు పైకి మెరిసిపోయినంత అందమైనవి కావు! తాజా ఉదాహరణ బ్రిట్నీ స్పియర్స్! అందం, అభినయం, గాత్రం, గ్లామర్… అన్నీ ఉన్నా… తనకు స్వేచ్ఛ లేదంటోంది అమెరికన్ పాప్ స్టార్!39 ఏళ్ల బ్రిట్నీ లాస్ ఏంజిలెస్ కోర్టులో తన మానసిక వేదన మొత్తం బయట పెట్టింది. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో స్పియర్స్ కు తీవ్రమైన […]
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క ఇరువురు కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు ధృవీకరిస్తూ.. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. జూన్ 21న ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచినట్లుగా లేఖలో పేర్కొన్నారు. జూన్ 22న అంత్యక్రియలు ప్రజల మధ్యనే పూర్తి చేసి, శ్రద్ధాంజలి ఘటించినట్లుగా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో తెలిపాడు. […]
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫెమిలియర్ నేమ్ అయిపోయింది. అయితే, మనోజ్ బాజ్ పాయ్ స్టారర్ వెబ్ సిరీస్ లో ఆమె నటన చాలా మందిని ఆకట్టుకుంది. దాంతో బాలీవుడ్ లో ఆమెకు ఇప్పటికే కొన్ని ఇంట్రస్టింగ్ ఆఫర్స్ వచ్చాయట. అయితే, అక్కినేని వారి డాటర్ ఇన్ లా ఇంత వరకూ ఏ హిందీ సినిమాకు డాటెడ్ లైన్ మీద సిగ్నేచర్ చేయలేదు. కానీ, ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో తన మనసులో […]
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి గాసిప్స్ వార్తలు ఎక్కువ అయ్యాయి. హీరోయిన్ ఎంపిక మొదలు, ధనుష్ […]
కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952కు ఇటీవల కొన్ని సవరణలు చేసింది. సెన్సార్ అయిన సినిమాలను సైతం తిరిగి చూసే అధికారం, రీ-ఎగ్జామిన్ చేసే అధికారం కేంద్రానికి ఉండేలా చేసింది. అయితే… ఇలాంటి పలు అంశాలతో రూపొందిన ఇండియన్ సినిమాటోగ్రఫీ అమాండ్ మెంట్ బిల్ 2021ని కేంద్రం ఆమోదించింది. చిత్రం ఏమంటే ఇప్పటి వరకూ ఉన్న ట్రిబ్యునల్ ను ఈ సవరణల ద్వారా కేంద్రం రద్దు చేసింది. దాంతో సెన్సార్ సభ్యుల కోరలకు మరింత పదను ఏర్పడినట్టు […]
‘’రణవీర్ సింగ్ నా వాడు’’ అంటోంది దీపికా పదుకొణే! అది అందరికీ తెలిసిందేగా అంటారా? నిజమే, 2018లోనే రణవీర్ ని దీపిక కొంగున ముడి వేసుకుంది. అంతే కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అప్పడప్పుడూ తన భార్య కోసం సొషల్ మీడియాలో అద్భుతమైన మాటలు, కవితలు రాసేస్తుంటాడు. రణవీర్ కి దీపిక మీద ఉన్న ఇష్టం చాలాసార్లు బయటపడుతూనే ఉంటుంది. అయితే, దీపూ అంతగా బయటపడదనే చెప్పాలి. కానీ, వీలైనప్పుడల్లా హజ్బెండ్ ని ఆహా, ఓహో అంటూ […]
మిల్కీ బ్యూటీ తమన్నా ముచ్చటగా మూడో వెబ్ సీరిస్ కు పచ్చ జెండా ఊపేసింది. ఇప్పటికే తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సీరిస్ లలో తమన్నా నటించింది. ‘లెవన్త్ అవర్’ బిజినెస్ వరల్డ్ నేపథ్యంలో సాగే వెబ్ సీరిస్ కాగా, ‘నవంబర్ స్టోరీ’ అందుకు పూర్తి భిన్నమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సీరిస్. ఈ రెండు వెబ్ సీరిస్ లలో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో మరికొంతమంది నిర్మాతలు […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘శక్తి, ఊసరవెల్లి’ చిత్రాలతో పాటు హిందీ, తమిళ చిత్రాలలోనూ నటించాడు విద్యుత్ జమ్వాల్. పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు యాక్షన్ హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… ఇటీవలే సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించిన విద్యుత్ జమ్వాల్ త్వరలోనే హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి, చిత్రాలను నిర్మించడంతో పాటు తానూ నటుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందబోతున్నాడు. బ్రూస్ లీ, జాకీ చాన్, జెట్లీ తర్వాత మర్షల్ ఆర్ట్స్ లో అంతర్జాతీయంగా […]
ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్టిల్ ఫోటోగ్రాఫర్ శివన్ (89) కన్నుమూశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఆయన కుమారుడే! అరవై సంవత్సరాల క్రితం ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో శివన్ స్టూడియో పేరుతో ఫోటో స్టూడియోను పెట్టారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ గా శివన్ విశేష ఖ్యాతి గడించారు. పలు సాంస్కృతిక సంస్థలకు ఆయన ఫోటో స్టూడియోనే కేంద్రంగా ఉండేది. ఆయన తీసిన ఛాయాచిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఆమె.. మరోవైపు పవర్ ఫుల్ పాత్రలు కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటుంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషించబోతోంది. ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటించనున్నారు. సాయి కబీర్ […]